Kushboo: నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు.. నాన్నేఅలా చేశాడంటూ?

Kushboo: దక్షిణ భారత దేశంలోని టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు ఖుష్బూ. ఈమె ఆ రోజుల్లో తెలుగు, తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ఇప్పటికీ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే ఉంది. అయితే ఖుష్బూకి ఆరోజుల్లో తమిళనాడు లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. అక్కడి జనం ఎవరినైనా అభిమానిస్తే, ఆరాధిస్తారు కూడా.

 

ఖుష్బూ అంతటి ఆరాధ్యం బహుశా మనం స్టార్ హీరోలకు కూడా చూసి అప్పట్లో లేదు. కేవలం సినిమాల్లోనే కాదు ,ఈమె రాజకీయాల్లో కూడా గొప్పగా రాణిస్తుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ కొనసాగుతున్న ఖుష్బూ సుందర్ రీసెంట్ గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె సమాజంలో ఆడవాళ్లపై అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో తన జీవితం లో చోటు చేసుకున్న ఒక చేదు నిజాన్ని పంచుకుంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం గా మారాయి.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఖుష్బూ పాల్గొంది. ఈ సందర్భంలోనే తన జీవితంలో జరిగిన ఓ చేదు ఘటనను నెమరువేసుకుంది. నేను నా చిన్నతనం నుండే లైంగిక వేధింపులకు గురి అయ్యాను. అది ఎక్కడో కాదు, నా కన్న తండ్రి దగ్గరే. ప్రతీ రోజు తాగేసి ఇంటికి వచ్చేవాడు. మా అమ్మని కొట్టేవాడు, నన్ను లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. నా 8 ఏళ్ళ వయస్సు నుండి ఆ కామాందుడు నుండి ఇవన్నీ నేను భరించాను. నాకు 15 ఏళ్ళ వయస్సు వచ్చినప్పుడు అతనిపై తిరిగి దాడి చెయ్యడం ప్రారంభించాను. నాకు 16 వ వయస్సు వచ్చే సమయానికి అతను మా కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయాడు అంటూ చెప్పింది ఖుష్బూ. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు విన్నవారంతా, అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి ఇలాంటి నీచమైన పరిస్థితి ఏర్పడిందా.. అయినా కన్న కూతురు పై అత్యాచారం చెయ్యడం ఏమిటి అని సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -