Kiwi fruit: వామ్మో.. కివీ ఫ్రూట్ వల్ల అన్ని ప్రయోజనాలా?

Kiwi fruit: కివీ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తినేవారు.. కానీ కరోనా మహమ్మారి తర్వాత చాలామంది వీటిని తినడంతో ఈ పండ్లకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. కివీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, జింక్, నియాసిన్, రైబోఫ్లావిన్, బీటా కెరోటిన్ మొదలైన పోషకాలు లభిస్తాయి.

శరీరం సరిగ్గా పనిచేయడానికి ఈ పోషకాలన్నీ అవసరం. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం ద్వారా లభించే ఈ పోషకాలు, ఒక్క కివీ పండు తినడం ద్వారా లభిస్తాయి. కివీ లో నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. విటమిన్ సీ తో పాటు ఇందులో విటమిన్ కె, ఈ ఉంటాయి. కాగా ప్రతిరోజు 2 లేదా 3 పండ్లు తింటే కంటిసంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. ఈ పండు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో బరువు తగ్గాలి అనుకున్న వారికి ఈ పండు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. కివీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

 

అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంచుతుంది. డయాబెటిక్స్ కూడా కివీను తీసుకోవడం సురక్షితమే. ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడేవారు కొన్ని కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ క్లియర్ అవుతుంది. కివి ఫ్రూట్ లో పీచుపదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం అని చెప్పవచ్చు. కివి పండు బరువును తగ్గిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తుంది. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. కివి పండులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ సి కళ్లకు ఇటువంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఈ కివి పండ్లు గుండెను రక్షిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -