Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ విషయంలో మరో సెంటిమెంట్.. ఏమైందంటే?

Varalaxmi Sarathkumar: తెలుగు ప్రేక్షకులకు ఉన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది వరలక్ష్మి శరత్ కుమార్. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాతో భారీగా సక్సెస్ అందుకొని వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇటీవలే తెలుగులో విడుదలైన హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.

 

అయితే తమిళంలో కన్నా ఎక్కువగా తెలుగులో బిజీ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇక్కడ నటనకు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. హీరోయిన్ కాకపోయినా కొన్నిసార్లు వాళ్ళను డామినేట్ చేసే స్థాయిలో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తోంది. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ సంచలనంగా నిలిచిన హనుమాన్ మూవీలో తేజ సజ్జ అక్కయ్యగా తన పెర్ఫార్మన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రీ క్లైమాక్స్ కి ముందు విలన్ వినయ్ రాయ్ చేతిలో హత్యకు గురయ్యాక మంచి ఎమోషన్ పండింది. అదేవిధంగా గత ఏడాది విడుదల అయిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా వరలక్ష్మికి కన్నుమూసే పాత్రే దక్కింది.

బాలకృష్ణ చెల్లెలిగా ముందు నెగటివ్ షేడ్స్ తో మొదలై ఆపై తప్పు తెలుసుకుని చివరికి ఆత్మహత్య చేసుకునే సోదరిగా అందులో బెస్ట్ ఇచ్చింది. అంతకు ముందు రవితేజ క్రాక్ లో సముద్రఖని సర్వస్వంగా పక్కనే ఉంటూ చివరికి అతని వల్లే హతమయ్యే జయమ్మగా అదరగొట్టింది. ఈ మూడు సినిమాలు సంక్రాంతికే రావడం మరో కాకతాళీయం. లెన్త్ సంగతి పక్కన పెడితే నటన పరంగా అన్నింటికి ప్లస్ గా నిలవడం గా గమనించాల్సిన విషయం. గత కొన్నేళ్లుగా వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో తనదైన ముద్ర బలంగా వేస్తోంది. చూస్తుంటే సంక్రాంతి సినిమాల్లో వరలక్ష్మి పాత్రను చంపేస్తే హిట్టు ఖాయమనిపిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఏ సినిమాలో నటించిన కూడా అందులో ఆమె పాత్రను చంపేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -