CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా అటు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రావటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడమే కాకుండా ఆయన సహాయ సహకారాలు అందించారు. ఈ క్రమంలోనే ఈసారి ఏపీలో జరగబోయే ఎన్నికలలో కూడా పరోక్షంగా కెసిఆర్ తన పార్టీ వైసీపీకి మద్దతు తెలుపుతుందని చెప్పాలి. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోరమైన ఓటమి అందుకున్నటువంటి బిఆర్ఎస్ లో పార్లమెంట్ ఎన్నికలలో ఆయన మంచి మెజారిటీ సాధించారని భావిస్తుంది.

ఈ క్రమంలోనే వేములవాడలో ఆదివారం జరిగినటువంటి పార్టీ సమావేశంలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండటం తెలంగాణకు అవసరం అన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా బీఆర్ఎస్ మాత్రమే నిలువరించగలదని అన్నారు. ఈ క్రమంలోనే సోమవారం చోడవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

ఏపీ సీఎం జగన్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను చంద్రబాబు కారణంగా దూరం చేసుకున్నామని పేర్కొన్నారు. అసలు ఉమ్మడి రాజధాని ముగిసిన అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్, వైసీపీలు ఈ అంశాన్ని లేవనెత్తడం కాకతాళీయమేనా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2024తో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకేసారి ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడారా అన్న సందేహాలు అందరిలోనూ మెదలుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -