Yashoda Teaser Review: గర్భవతి అయిన సమంత.. తొలిసారి అలాంటి పాత్రలో కనిపిస్తూ?

Yashoda Teaser Review: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ సమంత క్రేజ్ ప్రస్తుతం అంచనాలకు మీదుగా జోరుగా కొనసాగుతుంది. ఏ ఇండస్ట్రీలో నైనా అవకాశాలు ఇట్టాగే సొంతం చేసుకుంటుంది సమంత. అలా ప్రస్తుతం తన ఖాతాలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో సమంత యశోద అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేశారు ఈ సిని బృందం. ఇక ఈ టీజర్ చూసినట్లయితే చాలా ఆసక్తిగా అనిపించింది.

కథ మొత్తం సమంత చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ టీజర్ లో సమంత హాస్పిటల్ కి వెళ్లి చెక్ అప్ చేయించుకోగా తను ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెబుతుంది. దీంతో మూడు నెలల వరకు ఆ డాక్టర్ కొన్ని పనులు చేయవద్దు అని జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. కానీ సమంత ఆ పనులు చేస్తున్నట్లు చూపించారు టీజర్ లో.

అలా టీజర్ లో కాన్సెప్ట్ గా ఒక్కో డైలాగ్ కు నెగటివ్ యాంగిల్ లో సీన్ కట్ చేసుకుంటూ ఇచ్చారు. అలా ఆ సీన్స్ మొత్తం చూస్తుంటే యశోద గా ఉన్న సమంత ఇందులో ఏదో కష్టం ఎదుర్కొన్నట్లు చూపించారు. ఇక అందులో సమంత ఎదుర్కొనే సంఘటనలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, సస్పెన్స్ గా కనిపించాయి.

ఇందులో టెక్నికల్ వర్క్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చూపించారు. మొత్తానికి ఈ టీజర్ యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది. అతి తక్కువ క్షణాల్లోనే తెగ లైక్స్ సంపాదించుకుంది ఈ టీజర్. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. టీజర్ కు తగ్గట్టుగా సినిమాలో చూపిస్తారో లేదో అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -