IT Employees: ఐటీ ఉద్యోగులకు మరో షాకింగ్ న్యూస్.. ఏం జరిగిందంటే?

IT Employees: ఏరి కోరి ఐటీ ప్రొఫెషన్ ఎంచుకున్న ఫ్రెషర్స్ వాళ్ళ కలల ప్రపంచం తారుమరయ్యే పరిస్థితి వచ్చింది. ఏసీ గదిలో కూర్చొని పేరున్న కంపెనీలో జాబ్ చేయాలన్న వాళ్ల కలలు నీరు కారిపోతున్నాయి. ఈ కోర్సు ఎందుకు తీసుకున్నామో అనే పరిస్థితికి వచ్చేసారు ఫ్రెషర్స్. అందుకు కారణాలు లేకపోలేదు.

 

కోవిడ్ సమయంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన పలు ఐటీ సంస్థలు ఇప్పుడు వారిని వదిలించుకునే పనిలో పడ్డాయి. అలాగే వారి వేతనాల్లో కోతలు విధించేందుకు సిద్ధమయ్యాయి. కొత్తగా నియమించుకున్న ఉద్యోగులకు ఐటీ సంస్థలు మొదట్లో ఆఫర్ చేసిన జీతంలో సకానికే పనిచేయాలని కోరడంతో అవాక్కయ్యారు ఫ్రెషర్స్.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం దృష్ట్యా క్లైంట్ల నుంచి డీల్స్ రావటం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతానికే ప్రాజెక్టులను అంగీకరించాలని లేనిపక్షంలో జాబులు వదులుకోవడానికి సిద్ధపడ్డావచ్చని ఐటీ కంపెనీలు చెప్పటంతో నోరెళ్లబెడుతున్నారు ఫ్రెషర్స్. కొందరు ఈ అవకాశానికి ఒప్పుకోవటం లేదు కానీ కొందరు ఎక్స్పీరియన్స్ కోసమైనా ఇలాంటి జాబ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు.

 

రెండు మూడు సంవత్సరాల తర్వాత వేరే కంపెనీలకి ఈ ఎక్స్పీరియన్స్ పనికొస్తుందని ఉద్దేశంతో శాలరీ తక్కువ అయినప్పటికీ పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్, ఐబిఎం, ఆపిల్, మెటా మైక్రోసాఫ్ట్ యాక్సెంచర్ ఇలా అన్ని అష్టదిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను ఇప్పటికే చాలామందిని ఇంటికి పంపించాయి.

 

ఉన్న కొద్దిమందికి శాలరీలు తగ్గిస్తామంటూ ప్రెజర్ పెడుతున్నాయి. ఇవన్నీ చూసిన ఫ్రెషర్స్ తమ భవిష్యత్తుని చూసి భయపడుతున్నారు. నచ్చిన కంపెనీలో ఉద్యోగం వచ్చిందన్న వారి ఆశలు ఆరంభంలోనే అడియాసలు అవుతున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆన్ బోర్డింగ్ చేయించుకునేందుకు కూడా కంపెనీలు జాప్యం చేస్తున్నాయి.

 

శిక్షణ సమయంలో పేలవమైన పనితీరు కనబరిచిన 425 మందిని ఒక టెక్ కంపెనీ ఫ్రెషర్స్ ని విధుల నుంచి తొలగించింది. ఇక వారు ఇచ్చిన ఆఫర్స్ ని అంగీకరించకపోతే తమకి కూడా అదే గతి పడుతుందని ఆందోళన పడుతున్నారు నూతన ఉద్యోగులు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -