CM Jagan: జగన్‌ మార్క్‌ ట్రాన్స్‌ఫర్లు.. వింత పోస్టింగ్ లతో సీఎం జగన్ పార్టీ పరువు తీసేస్తున్నారా?

CM Jagan: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఏపీ ప్రభుత్వానికి పట్టవు కానీ.. కొంతమంది భజనపరులైన అధికారులకు మాత్రం సీఎం జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. వారి కోసం నిబంధనలు పక్కన పెడుతున్నారు. కొత్త పోస్టింగులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా సుమారు రెండు వేలమంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఏపీలో పని చేస్తున్నారు. వారి కుటుంబం తెలంగాణలో ఉంటే వారు మాత్రం ఏపీలో ఉద్యోగాలు చేస్తున్నారు. తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఏళ్ల తరబడి వాళ్లు దరఖాస్తు పెట్టుకోవడమే తప్పా.. వారికి బాధను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

తెలంగాణ, ఏపీ సీఎస్ ల ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి వారి సమస్యలకు ఓ పరిస్కారం కూడా తయారు చేశారు. వారి బదిలీలకు సంబంధించిన నిబంధలను ఖరారు చేశారు. అయితే అవి కాగితాలకే పరిమితం అయ్యాయి తప్పా.. బదిలీలు జరగలేదు. ఆ నిబంధల మేరకు రెండు వేల మంది ఉద్యోగులు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. గత సీఎస్ సమీర్ శర్మ వారిని తెలంగాణకు పంపడానికి నిరభ్యంతర పత్రం కూడా ఇచ్చారు. కానీ, బదిలీలు మాత్రం జరగలేదు. ఇప్పుడు కొత్త సీఎస్ వచ్చిన తర్వాత ఉద్యోగులు ఒక్కొక్కరుగా దరఖాస్తులు చేసుకొని వారి గోడు వినిపిస్తున్నారు. కానీ.. సీఎస్ లో మాత్రం చలనం లేదు. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఫారుసులు లేఖలు సీఎస్ కు అందించారు. ఏడు నెలలుగా ఆ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

వేతన జీవులు విషయంలో ఇంత కర్కశంగా వ్యవహిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు తమకు భజన చేసేవారి కోసం మాత్రం కొత్త కొత్త పోస్టింగులు క్రియేట్ చేసి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ధార శ్రీను అనే అధికారి 2014లో కేంద్ర కార్మిక శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఆప్ లేబర్ గా చేరారు. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటేషన్ పై అప్పటి మంత్రి కన్నబాబు దగ్గర ఓఎస్డీగా చేరారు. కన్నబాబు తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా జోగి రమేష్ దగ్గర ఓఎస్డీగా కొనసాగారు. సెంట్రల్ నుంచి స్టేట్ సర్వీస్ లోకి మార్చాలని ఆయన సీఎస్ దగ్గర దరఖాస్తు చేసుకున్నారు. గానీ గత సీఎస్ సమీర్ శర్మ మాత్రం ఆయన ప్రతిపాదనను తిరస్కరించారు. సెంట్రల్ నుంచి స్టేట్ కు అలా మార్చడం నిబంధనలకు విరుద్దమని చెప్పారు. అయితే, కొత్తగా జవహార్ రెడ్డి సీఎస్ గా నియమాకం అయిన తర్వాత నిబంధనలను తుంగలో తొక్కి ధార శ్రీనును సెంట్రల్ నుంచి స్టేట్ కు పర్మినెంట్‌గా తీసుకొని వచ్చి ఈ నెల 7న ఓ జీవో కూడా రిలీజ్ చేశారు. కార్మిక శాఖలో అదనపు కమిషనర్ గా కొత్త పోస్టు క్రియేట్ చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా ఉన్న దశరథరామిరెడ్డిని తెలంగాణ జైళ్ల శాఖ నుంచి ఏపీలో మున్సిపల్ శాఖలో కమిషనర్ గా నియమించారు. ఆయన తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగి. తెలంగాణ జైళ్ల శాఖలో సూపరింటెండెంట్‌గా ఉన్నారు. స్థానికత ఆధారంగా దశరాథరామిరెడ్డిని ఏపీ రీఆర్గరైజేషన్‌ కమిటీ తెలంగాణకు కేటాయించింది. కానీ, జగన్‌కి వీర విధేయుడు, భజనపరుడు కావడంతో నిబంధనలను తుంగలో తొక్కి సజ్జలకు ఓఎస్డీగా నియమించారు. గత ఏడాది నవంబరు 23న జీవో 146 ద్వారా మునిసిపల్‌ కమిషనర్‌గా నియమించారు. ఇలా చెప్పుకుంటే చాలా మంది భజనపరుల కోసం జగన్ కొత్త జోవోలు తీసుకొని వచ్చారు. చాలా నిబంధలనలను ఉల్లంఘించారు. కానీ.. నిబంధనల ప్రకారం తెలంగాణ వెళ్లాల్సిన గోడు మాత్రం పట్టించుకోవడం లేదు

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -