Teachers: స్కూల్ టీచర్లు పిల్లలతో అలాంటి పనులు చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Teachers: ఈ మధ్య కాలంలో చాలామంది ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యార్థులు నేర్పించాల్సింది పోయి వారితోనే అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని చెడు మార్గంలో ప్రయాణించేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్ లోని విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడుతున్న మహిళా టీచర్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులు వ్యవధిలో మొత్తం ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ లో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాలిఫోర్నియా లోని డానివిళ్లే పట్టణానికి చెందిన ఎలెన్ షెల్ 38 అనే మహిల స్థానిక పాఠశాలలో పని పనిచేస్తోంది.

ఇటీవల ఆమె ఇద్దరు పదహారేళ్ల యువకులతో పలుమార్లు లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి గరార్డ్ కౌంటి కోర్టు ముందు హాజరు పరిచారు. ఆమెపై థర్డ్ డిగ్రీ అత్యాచారం అభియోగాలు నమోదయ్యాయి. అలాగే ఆర్కన్సాస్ రాష్ట్రానికి చెందిన హెథర్ హరే అనే 32 ఏళ్ళ మహిళా టీచర్ పైనా లైంగిక దాడికి సంబంధించిన కేసు నమోదు అయింది. టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు వినిపించాయి. దాంతో ఆ విషయంపై కేసు నమోదు తీసుకున్న పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఒక్ల హామాకు చెందిన ఏమీలి హాన్కాక్ 26 ఏళ్ళ మహిళ కూడా విద్యార్థులతో సంబంధం నేరుపుతోందని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

అదేవిధంగా లిన్ కాల్న్ కౌంటిలోని ఓ పాఠశాలలో ఒప్పంద ప్రకారం పనిచేస్తున్న మరో టీచర్ ఎమ్మా డిలానే అదే పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకున్నట్లు అతడితో స్నాప్ చాట్ లోను సంభాషించేదని తెలిసింది. అయోవా రాష్ట్రంలోని దేస్ మొయిన్స్ లో ఉన్న హైస్కూల్లో కృస్టెన్ గ్యాంట్ అనే ఇంగ్లీష్ టీచర్ అదే పాఠశాలకు చెందిన టీనేజీ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ కలిసిన దృశ్యాలు సీసీటీవీలోనూ రికార్డు కూడా అయ్యాయి. ఇక అమెరికాలోని వర్జీనియాలోని ఒక హై స్కూల్లో 33 ఏళ్ల మహిళా టీచర్ ఒక విద్యార్థితో చాలా నెలలుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోందన్న ఆరోపణలపై కేసు నమోదు అయింది.

ఈమె సదరు విద్యార్థిపై లైంగికంగా అనేకసార్లు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు. అలాగే పెన్సిల్వినియాకు చెందిన జావేలిన్ కోచ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈమె కూడా 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులతో లైంగికంగా అనేకసార్లు కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో విద్యార్థులతో మహిళా టీచర్లు లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి రెండు రోజుల్లోనే ఆరు కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -