Tollywood: ఇండస్ట్రీలోనే కాకుండా గురువుగా కూడా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రెటీలు వీళ్లే!

Tollywood: ఈరోజు అనగా సెప్టెంబర్ ఐదు అంటే టీచర్స్ డే.. ఈరోజు విద్యార్థులందరూ ఉపాధ్యాయులను పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలల లో విద్యార్థులు.. ఈ ఒక్కరోజు గురువుల బాధ్యత చేపట్టి నిజమైన గురువు లాగా పాటలు బోధిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం టీచర్స్ డే ని ఎంతో అందంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇలా ప్రతి రంగంలో శిష్యులను ముందుకు నడిపే ఒక గురువు ఉంటాడు. ఇలా ప్రతి ఒక్క గురువుని సెప్టెంబర్ ఐదున గౌరవించాలి. ముఖ్యంగా సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు.. ఈయన ఉపాధ్యాయ బాధ్యతలను ఎంత గౌరవంగా పూర్తి చేశాడు. ఇతడు సెప్టెంబర్ 5న జన్మించాడు. కనుక ఈరోజు గురువులను పూజిస్తారు. మరి సినిమా ఫీల్డ్ లో కూడా కొంతమంది స్టార్లు గురువు బాధ్యతలు చేపట్టే.. తర్వాత సినీ ఫీల్డ్ ను ఎంచుకున్నారు.

ఇప్పుడు ఆ యాక్టర్ల వివరాలు మనం తెలుసుకుందాం. దర్శకుడు త్రివిక్రమ్ కూడా కొంతకాలం ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టాడు. గౌతమ్ రాజు అబ్బాయికి ఆయన ప్రైవేట్ గా పాఠాలు చెప్పారు. అలా పాటలు చెబుతూనే.. సినీ అవకాశాల కోసం ఎదురుచూశాడు. ఇక దర్శకుడు సుకుమార్ కూడా కొంతకాలం గణిత ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. కాకినాడలో కొన్ని సంవత్సరాలు పాటుగా.. సుకుమార్ లెక్కల మాస్టారుగా పనిచేశాడు.

ఉద్యోగం మానేసిన తర్వాతే.. సుకుమార్ సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక హాస్య నటుడు బ్రహ్మానందం కూడా కొంతకాలం ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టి.. తర్వాత సినీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఇదే క్రమంలో ఎమ్మెస్ నారాయణ కూడా గురువుగా పనిచేశాడు. బ్రహ్మానందం అత్తిలి లో ఉద్యోగం చేస్తూనే సినీ అవకాశాల కోసం ఎదురు చూశాడు. అటు కొంతకాలం ఉద్యోగం చేస్తూ.. ఇటీసీని రంగంలో రాణించాడు. ఇక తనికెళ్ల భరణి కూడా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చాలా కాలం పాఠాలు చెప్పాడు. ఇదే క్రమంలో పరుచూరి గోపాలకృష్ణ కూడా టీచర్ గా కొంతకాలం పనిచేశాడు.. ఆ తర్వాత సినీ రంగాన్ని ఎంచుకున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -