Chanakya: ఈ వ్యక్తులతో దయగా వ్యవహరిస్తున్నారా.. ఇబ్బందులు తప్పవంటూ?

Chanakya: ఆచార్య చాణక్యుడి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మహా జ్ఞాని. ఆయనకు ఉన్న తెలివితేటల వల్ల ఎంతోమంది మహారాజులు ఆయన సలహాల మేరకు రాజ్యాన్ని పాలించేవారు. ఆచార్య చాణుక్యుడు తెలిపిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలను ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాల ప్రకారం జీవితంలో ముగ్గురు వ్యక్తుల పట్ల పొరపాటున కూడా దయ చూపించకూడదు. అలాంటి వ్యక్తుల మీద దయ కలిగి ఉంటే మన జీవితం నాశనం అవుతుందని చాణక్యుడి నీతి సూత్రాలలో వివరించబడింది.అయితే జీవితంలో ఎటువంటి వ్యక్తుల వద్ద దయగా ఉండకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.

• మూర్ఖుడుకి సహాయం చెయ్యద్దు:

జీవితంలో మూర్ఖుల పట్ల ఎప్పుడు దయ చూపరాదు. ఎందుకంటే మూర్ఖులు ఎప్పుడు కూడా మూర్ఖంగానే ఆలోచిస్తూ అహంకారం ప్రదర్శిస్తూ ఉంటాడు. దీంతో మనం అలాంటి వారి మీద దయ చూపించి మంచే చేయాలని చూసినా కూడా వారు అహంకారంతో మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అందువల్ల మూర్ఖుల పట్ల ఎప్పుడు దయ చూపకూడదని చాణక్యుడు నీతి సూత్రాలలో వివరించబడింది.

• అసంతృప్తి, విచారం ఉన్న వ్యక్తులు :

అసంతృప్తి విచారంలో ఉన్న వాళ్ళ పట్ల కూడా దయ చూపడం మంచిది కాదు. ఎప్పుడూ అసంతృప్తిగా ఉన్నవారికి దయతో ఎంత సహాయం చేసినా కూడా వారు ఇంకా అసంతృప్తిగానే ఉంటారు. అలాగే ఎల్లప్పుడూ విచారంగా ఉన్న వ్యక్తులు పట్ల దయ చూపిన కూడా వారి పద్ధతిలో ఎటువంటి మార్పు ఉండదు. అంతే కాకుండా మనం మంచి చేయాలని చూసినా కూడా వారు ప్రతి విషయాన్ని నెగిటివ్ గానే తీసుకుంటారు.

• వ్యక్తిత్వం లేని స్త్రీ:

అలాగే వ్యక్తిత్వం లేని స్త్రీ పట్ల దయ చూపించడం, అటువంటి స్త్రీలతో మంచిగా ఉండడం సహాయం చేయకూడదని చాణక్యుడు నీతి సూత్రాలలో వివరించాడు.వ్యక్తిత్వం లేని స్త్రీకి కనుక సహాయం చేస్తే అది దుర్వినియోగమే అని చాణక్య చెబుతున్నారు. ఎందుకంటె ఇలాంటి స్త్రీకి కేవలం డబ్బు మీద తప్ప మిగిలిన దేని మీద కూడా ఆసక్తి ఉండదని చాణక్య అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -