Anitha Chowdary: ఆ ఒక్క డైలాగ్ అందరి హృదయాలను తాకింది: అనిత చౌదరి

Anitha Chowdary: ఆర్టిస్ట్ అనితా చౌదరి అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ సీరియల్ నటి కస్తూరి అంటే మాత్రం టక్కున అందరికీ ఆమె గుర్తుకు వస్తారు. యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించిన అనిత చౌదరి అనంతరం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈమె మంజుల నాయుడు దర్శకత్వంలో నటించిన కస్తూరి సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.

ఏడు సంవత్సరాల పాటు టెలివిజన్ లో ప్రసారమైన ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రేక్షకుల మదిలో కస్తూరిగా నిలిచిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత చౌదరి తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు కస్తూరి సీరియల్ ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందని తెలియజేశారు.

ఈ సీరియల్ ప్రసారమయ్యే సమయంలో సోషల్ మీడియా లేదు కనుక ఎంతో మంది అభిమానులు తనకు ఉత్తరాలు రాసేవారని ఈ సీరియల్ సమయంలో నన్ను ఆడవాళ్లు మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా కస్తూరి పాత్రను ఇష్టపడ్డారని ఈమె తెలిపారు. మరి కొంతమంది ఉత్తరాల ద్వారా నాకు ఫిర్యాదులు చేస్తూ మధ్యాహ్నం 12 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కావడంతో తమ భార్యలు భోజనం కూడా పెట్టడం లేదు అంటూ ఫిర్యాదులు చేశారని ఈమె తెలిపారు.

ఈ సీరియల్ తనకు అంతగా ప్రేక్షకాదరణ తీసుకువచ్చిందని ప్రేక్షకుల ఆదరాభిమానాలు కన్నా ఇతర అవార్డులు ఏవి గొప్పవి కాదంటూ ఈమె తెలిపారు. ఇక చత్రపతి సినిమాలో తాను నటించిన పాత్రకు మంచి ఆదరణ లభించింది ఈ సినిమాలో సూరీడు.. ఓ సూరీడు.. ఏడున్నావురా? బస్సుకు ఏలవుతోంది అనే డైలాగ్‌ ఫ్యాన్స్‌ మనసును తాకింది అంటూ ఈ సందర్భంగా ఈమె తన కెరీర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -