Babu Mohan: చిరు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్.. ఇంతకు ఏమన్నారంటే?

Babu Mohan: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి అతని నటన గురించి పెద్దగా పరిచయంకర్లేదు. కెరీర్ లో ఎన్నో కష్టాలు పడి తన సొంత టాలెంట్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. దాదాపు 150 సినిమాలుకు పైగా నటించి నటనలో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో చిరంజీవి నటన విషయంలోనే కాకుండా బ్రేక్ డాన్స్ లో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా వరుస సినీ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడు చిరు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక చిరంజీవి మంచితనానికి మరో పేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి కాదనకుండా తగినంత సహాయం చేస్తాడు. ఇక చిరంజీవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు.

ఇదిలా ఉంటే యాక్టర్ బాబు మోహన్ గారి గురించి మనందరికీ తెలిసిందే. అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్యనటుడుగా తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు. మరి బాబు మోహన్ గతంలో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. చిరంజీవి ఒక మగాడు. ఆయన డాన్స్ విషయంలో రబ్బరు లా తిరుగుతాడు. ఇప్పటికీ ఆయన డాన్స్ టీవీలో వస్తే నేను కళ్ళు పెద్దవిగా చేసుకొని చూస్తూ ఉంటాను.

అని బాబు మోహన్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. ఇక త్వరలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఆచార్య సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన చిరు.. గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాను ఈ దసరా కానుక గా విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -