Khaidi: ఖైదీ టైటిల్ తో బాలయ్య సక్సెస్ సాధించిన సినిమా ఏదో తెలిస్తే తెలిస్తే షాకవ్వాల్సిందే!

Khaidi: ఖైదీ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ ను మలుపు తిప్పింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అప్పట్లోనే ఘనవిజయం సాధించింది. దానికి తోడు ఈ సినిమా విడుదల అయిన సమయంలో నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే హీరో తెలుగులో ఎవరు అన్న సమయంలో ఖైదీ సినిమాతో లైన్లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.

ఖైదీ సినిమా తర్వాత ఇదే పేరుతో చిరు ఖైదు నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 ఇలాంటి ఎన్నో సినిమాల్లో నటించి భారీ విజయాలను అందుకున్నాడు. మన తెలుగు చిత్ర‌ పరిశ్రమలో ఖైదీ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి ఆ సినిమాలలో ఖైదీ రుద్రయ్య లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఖైదీ సినిమాతో చిరంజీవి మాత్రమే సూపర్ హిట్ కొట్టారని చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బాలకృష్ణ కూడా సేమ్ ఖైదీ లాంటి సినిమాతో తన కెరీర్లో మరో భారీ హిట్ అందుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

 

బాలకృష్ణ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అలా వీరిద్దరి కాంబినేషన్లో 1989లో వచ్చిన సినిమా భలే దొంగ. దేవి ఫిలిమ్స్ పతాకంపై కె. దేవి వరప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. బాలయ్యకు జోడిగా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య సురేంద్ర అనే దొంగగా నటించారు. మెయిన్ విలన్ గా చరణ్‌ రాజ్ కనిపించారు. అలాగే ఎస్పి ఇంద్రాణి పాత్రలో శారద నటించారు. తెలుగులో హిట్ అయిన ఈ సినిమాను ఖైదీ నెంబర్ 1 పేరుతో హిందీలోకి కూడా అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా బాలయ్య కూడా ఖైదీ పేరుతో ఒక హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -