Movie Titles: తెలుగు సినిమాలకు టైటిల్ పేర్లు కరువయ్యాయి.. ఒకే టైటిల్ తో వచ్చిన సినిమాలు ఏవో తెలుసా?

Movie Titles: తెలుగు చిత్ర పరిశ్రమలో లవ్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్, యాక్షన్ ఇంకా థ్రిల్లర్ ఇలా ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే సినిమాకు కథ ఎంత ముఖ్యమో, టైటిల్ అంతకంటే ముఖ్యం. సినిమాకు టైటిల్ పేరు ఖరారు చేయడానికి నానా అవస్థలు పడుతుంటారు దర్శకనిర్మాతలు.

టైటిల్ విషయంలో అస్సలు రాజీ పడకుండా అవసరమైతే పాత సినిమా పేర్లను కూడా వాడుతుంటారు. ఎందుకంటే సినిమా కథకు తగ్గట్టు టైటిల్ పేరు లేకపోతే ఆ సినిమాకు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. అందుకే గతంలో సినిమా టైటిల్ పేర్లు ఇప్పుడు ఒకటి రెండు కాదు మూడుసార్లు కూడా రిపీట్ అవుతున్నాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

ఖైదీ: హీరోగా చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం. తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమా రావడం జరిగింది. ఇక ముచ్చటగా మూడోసారి ఇదే ఖైదీ టైటిల్ తో కార్తీ హీరోగా నటించి ప్రేక్షకులను అలరించడం జరిగింది.

రాక్షసుడు: 1986లో చిరంజీవి హీరోగా ఈ సినిమా విడుదలైంది. 2015లో సూర్య తమిళంలో నటించిన చిత్రం పేరు కూడా రాక్షసుడు. మూడోసారి బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ టైటిల్ తో సినిమా చేయడం జరిగింది.

దేవదాస్: 1953లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఆ తరువాత 2016లో ఈ సినిమా టైటిల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు హీరో రామ్. ముచ్చటగా మూడోసారి హీరో నాని, హీరో నాగార్జున కలిసి దేవదాసు సినిమాతో సందడి చేశారు.

శ్రీమంతుడు: అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో నటించడం జరిగింది. తర్వాత ఇదే టైటిల్ తో శ్రీమంతుడు సినిమాను మహేష్ బాబు కూడా నటించడం జరిగింది.

శ్రీనివాస కళ్యాణం: అప్పట్లో ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించిన జరిగింది. ప్రస్తుతం ఇదే టైటిల్ తో నితిన్ సినిమాలో నటించడం జరిగింది.

సుల్తాన్: బాలకృష్ణ మొదట సుల్తాన్ సినిమా పేరుతో నటించడం జరిగింది. తర్వాత సుల్తాన్ సినిమా పేరుతో హీరో కార్తీ నటించడం.

తొలిప్రేమ: అప్పట్లో ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించడం జరిగింది. తరువాత ఇదే టైటిల్ తో వరుణ్ తేజ్ నటించిన జరిగింది.

ఖుషి: అప్పట్లో ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటించడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా పేరుతో విజయ్ దేవరకొండ, సమంతలు నటించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -