Birth Marks: అక్కడ మీకు పుట్టుమచ్చలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త పడాల్సిందే!

Birth Marks: మన జాతకంలో పుట్టుమచ్చలు కూడా ప్రధాన పాత్రని పోషిస్తాయని మనకి ఇదివరకే తెలుసు. ఈ పుట్టుమచ్చలు కొన్ని అదృష్టానికి కొన్ని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు ప్రజలు. అయితే అవి వారి వారి నమ్మకాలను బట్టి ఆధారపడి ఉంటాయి. అయితే ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చూద్దామా..రంగు, ఆకారం,పరిమాణం బట్టి అవి కనిపించే స్థానాలని బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుంది.

తలపై కుడిభాగంలోనూ నుదురు మధ్య భాగంలో కుడి కణతపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనియోగం కలుగుతుందట. ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలో ఉండే పుట్టుమచ్చలు ధనవంతులని చేస్తాయట. ఇక మాడుకి ఎడమవైపున పుట్టుమచ్చ ఉంటే మంచి తెలివితేటలతో పాటు బాగా మాట్లాడే గుణం కూడా వాళ్లకి ఉంటుందట.

 

వీళ్లు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతని ఇవ్వరట. సంతానాన్ని ప్రతిభంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంసారం చేయటమే ధ్యేయంగా పెట్టుకుంటారు. చాలావరకు పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకి ఒకే ఫలితాన్ని ఇస్తాయి. ఆడవాళ్ళకి తలపై పుట్టుమచ్చ మంచి ఫలితాలని ఇవ్వదు. మగవాళ్ళలో నుదురు విశాలంగా కనిపిస్తే మంచి ఆలోచన పరుడిగా గుర్తించవచ్చు.

అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చ ఉన్న పురుషుడు పరోపకారి అవుతాడంట. రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చ ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. పైగా వీరు స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవారై ఉంటారు. కుడి కంటి రెప్ప పై పుట్టుమచ్చ ఉంటే అపారమైన సంపదని కలిగి ఉంటారు.

 

కుడి కనుబొమ్మ మీద మచ్చ ఉంటే సుగుణశీలి అయిన భార్య లభిస్తుంది. ఇటువంటి వ్యక్తి శాంత స్వభావాన్ని కలిగి ఉంటాడని శాస్త్రం చెప్తుంది. పుట్టుమచ్చలు రంగులను బట్టి కూడా అదృష్ట దురదృష్టాలు వరిస్తాయట. ఆకుపచ్చ,ఎరుపు రంగులలో ఉన్న పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగుతాయి. నలుపు రంగు దరిద్రానికి సూచన.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -