Priyanka: కన్నీళ్లు పెట్టుకుంటూ బిగ్ బాస్ ప్రియాంక ఎమోషనల్.. ఏమైందంటే?

Priyanka: బిగ్ బాస్ 7 సీజన్లో స్పై బ్యాచ్ కి స్పా బ్యాచ్ కి జరిగిన పోటాపోటీ మరి ఏ బిగ్ బాస్ సీజన్ లోని జరిగి ఉండదు. బిగ్ బాస్ హిట్ అవ్వటానికి కారణం కూడా ఈ రెండు బ్యాచ్లే. స్పై బ్యాచ్ లో వ్యక్తి విన్నర్ అయితే స్పా బ్యాచ్ లో వ్యక్తి రన్నర్ అయ్యాడు.స్పా బ్యాచ్ లో ఒకరైనటువంటి బుల్లితెర నటి ప్రియాంక..

 

ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ అనవసరంగా బిగ్ బాస్ కి వెళ్ళాను అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే బిగ్ బాస్ తర్వాత తన లైఫ్ ఫెయిరీ టేల్ స్టోరీ లాగా అందంగా ఉంటుంది అనుకుంది ప్రియాంక. కానీ అందుకు భిన్నంగా జరిగింది తాజాగా తన తల్లికి సర్జరీ జరిగినట్లు పేర్కొంది ప్రియాంక. ప్రియాంక తల్లికి గత కొంతకాలంగా నెలసరి ఎక్కువగా అవుతుంది అంట.

బ్లీడింగ్ ఎక్కువ అవుతుండడంతో వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులు అని అనుకున్నారంట అయితే హాస్పిటల్లో టెస్టులు చేయించిన తర్వాత క్యాన్సర్ మొదటి దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రియాంక బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన తల్లికి ఈ సమస్య మొదలైందని చెప్పుకొచ్చింది ప్రియాంక. అయితే ప్రియాంక తల్లి మాత్రం బిగ్ బాస్ షోలో ఉన్న తన కూతుర్ని చూడడం కోసం హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు. ఇదంతా తాను బిగ్ బాస్ కి వెళ్లడం వల్లే జరిగింది.

 

నేను బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు అని బోరున ఏడ్చేసింది ప్రియాంక. అయితే గర్భాశయం తొలగిస్తే క్యాన్సర్ తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో వెంటనే తల్లికి ఆపరేషన్ చేయించింది ప్రియాంక. అయితే సర్జరీ విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను మా అమ్మ హెల్త్ మీద కేర్ తీసుకోవాల్సింది అని ఇప్పుడు బాధపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -