Constable: ఐదేళ్లకే కానిస్టేబుల్ జాబ్ సాధించిన బుడ్డోడు.. ఎలా అంటే?

Constable: మామూలుగా కానిస్టేబుల్ జాబ్ సంపాదించాలి అంటే రన్నింగ్ కొట్టాలి, ఎగ్జామ్స్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఫిజికల్ టెస్టులు పాస్ అవ్వాలి ఇలా చాలా తతంగమే ఉంటుందని చెప్పవచ్చు. ఇంత కష్టపడితే కానీ ఒక కానిస్టేబుల్ ఉద్యోగం రావడం కష్టం. కానీ ఒక ఐదేళ్ల చిన్నారికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అంతేకాదండోయ్ ఎస్పీ నుంచి అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నాడు ఒక ఐదేళ్ల చిన్నారి.

 

ఐదేళ్ల చిన్నారి ఏంటి? కానిస్టేబుల్ జాబ్ రావడం ఏమిటి అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. ప్రస్తుతం ఈ చిన్నారి గురించే సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. ఆ చిన్నారి పేరు నమన్ రాజ్వాడే. చతిస్గడ్ సుగ్గుజా జిల్లాకు నమన్ రాజ్వాడే పోలీస్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు. అయితే ఆ చిన్నారి వయసు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ భావన గుప్తా అపాయింట్మెంట్ ఆర్డర్ ని కూడా అందజేసింది.

నమన్ తండ్రి రాజ్ కుమార్ రాజ్వాడే పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కానీ అతను సెప్టెంబర్ 3,2021లో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దాంతో కారుణ్య నియామకం కింద ఐదేళ్ల చిన్నారి నమన్ కు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం దక్కింది. అయితే రూల్స్ ప్రకారం 18 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే పూర్తి అధికారాలు దక్కుతాయి. కానీ ప్రస్తుతానికి చైల్డ్ కానిస్టేబుల్ గా నమన్ రాజ్వాడే కొనసాగుతాడు.

 

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు చిన్నారి తండ్రి చనిపోవడం పట్ల బాధను వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు చిన్నారికి అప్పగించిన బాధ్యతను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చాలా గొప్ప పని చేశారు అంటూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -