Job Notification: పోలీస్ కావాలనుకునే వాళ్లకు శుభవార్త.. త్వరలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్!

Job Notification: పోలీస్ అంటేనే గౌరవమైన ఉద్యోగం. అందుకే చాలామంది పోలీస్ ఉద్యోగం చేయాలని అనుకుంటారు. ముఖ్యంగా పోలీస్ అవ్వడం ఒక గోల్ గా పెట్టుకుంటారు. దీంతో మధ్యలో ఏ ఉద్యోగాలు వచ్చిన కూడా చేయరు. అలా చాలామంది విద్యార్థులు పోలీసు చదువులు చదివి ట్రైనింగ్ తీసుకొని వచ్చే పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకుంటారు.

 

అయితే ఇప్పుడు పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వార్త చెప్పడంతో కాస్త ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 6,511 ఎస్సై ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో ఆ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

 

అయితే ఇందులో 483 ఎస్సై పోస్టులు, 6028 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో 387 ఎస్సై (సివిల్), 96 ఎస్సై (ఏపీఎస్పీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలలో 3508 సివిల్, ఏపీఎస్పీ లో 2520 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాల భర్తకి సంబంధించిన దరఖాస్తు ఈ నెల చివర్లో చేయనున్నారు.

 

ఇక వచ్చే నెల డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది 2023 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇక పరీక్షల్లో అర్హత సాధించిన అనంతరం ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. అందులో అర్హత పొందిన వాళ్లకు మెయిన్ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కోరింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -