వాటిని పూజ గదిలో అలా వేస్తే అపశకునాలే.. నిజమేమిటంటే!

హిందువులు ఉదయం లేవగానే పూజ చేసిన తర్వాతనే ఇతర పనులు ప్రారంభిస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో పూజగది ఉంటుంది. పూజగది లేని ఇళ్లే ఉండదు. అయితే పూజగది ఎటువైపు ఉండాలి.. అందులో ఏఏ వస్తువులు పెట్టాలనేది చాలా మందికి తెలిదు. పూజగది లో ఎలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించాలి, గుడిలో ఎలాంటి వస్తువులు ఉంచాలి అనేది పూజచేసే వారు తప్పకుండా తెలుసుకోవాలి. అవన్నీ తెలిస్తే వారి జీవితం సుఖసంతోషాలతో ఉంటుందని పలు శాస్త్రలు వెల్లడిస్తున్నాయి.

కొందరు తరచూ అగ్గిపెట్టెతో దీపం వెలిగించి అగ్గిపుల్లని అక్కడే ఉంచి దేవుడిని పూజిస్తారు. అలా అస్సలు చేయకూడదంట. అలా చేస్తే ఇబ్బందులకు గురవుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, దీపం వెలిగించిన అగ్గిపుల్లని ఎప్పుడూ కూడా పూజగదిలో వేయరాదు. ఇంటిలోని గుడిలో దేవతల విగ్రహం, చిత్రాలు సంతోష భంగిమలో ఉంచాలి. ఆలయంలో ఉంచిన చిత్రం లేదా విగ్రహం మధ్య కొంత దూరం ఉండాలట.

దేవాలయంలో దేవుడి ఉగ్రరూపం ఉన్న విగ్రహం లేదా బొమ్మను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు. ఇది ప్రతికూలతను తెస్తుందని శాస్త్రం చెబుతోంది. పూజ గదిలో ఉంచిన పూజ సామగ్రిని అలంకరించి ఉంచాలి. కాలిన నల్ల వత్తి లేదా కాలిన అగ్గిపుల్ల లేదా వాడిపోయిన పువ్వులు పూజగది లో ఉంచవద్దు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. ఇవన్నీ తెలుసుకుని పూజగదిలో నియమాలు పాటిస్తే జీవితాంతం ఆనందంగా ఉంటారని శాస్త్రలు వెల్లడిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -