Pooja Room Vastu Tips: ఇంట్లో పూజగదిని ఇలా ఏర్పాటు చేసుకుంటే కోటీశ్వరులు కావడం గ్యారంటీ.. పాటించాల్సిన చిట్కాలివే!

Pooja Room Vastu Tips: హిందువులు ప్రతి ఒక్కరు కూడా పూజగది విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఆర్థికంగా మానసికంగా కూడా ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు మెరుగుపడి డబ్బులు బాగా రావాలి అంటే గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… తూర్పు వైపు ఉండి, పూజించడం వలన అదృష్టం వస్తుంది. అదేవిధంగా పడమర వైపు ఉండి పూజించడం వలన కూడా మంచి జరుగుతుంది. డబ్బులు బాగా వస్తాయి.

ఉత్తరం వైపు ఉండి కూడా పూజించవచ్చు. అప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కానీ, దక్షిణం వైపు మాత్రం ఉండి ఎప్పుడు పూజ చేయకూడదు. ఎందుకంటె దక్షణం వైపు తిరిగి, పూజించడం వలన మంచి జరగదు. లేని పోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడూ కూడా పూజించేటప్పుడు, దేవుడు విగ్రహాలు, దేవుడు ఫోటోలని గచ్చు మీద పెట్టేయకూడదు. దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా ఇబ్బందులు వస్తాయి. చాలామంది దేవుడు పటాలకి పూలదండల్ని వేస్తూ ఉంటారు. ఆ దండలతో దేవుడి ముఖం కప్పేయకూడదు.

పూజగదిని కానీ పూజ మందిరాన్ని కానీ మెట్ల కింద, ముఖద్వారం ఎదురుగా, బేస్మెంట్ లో, టాయిలెట్ల దగ్గర పెట్టకూడదు. పూజగదిలో ఎడమవైపు ఒక గంటను పెడితే మంచిది. నెగటివ్ ఎనర్జీని ఆ గంట తొలగిస్తుంది. ఏదైనా దేవుడి విగ్రహం కింద ఎర్రటి గుడ్డ పెడితే, చాలా మంచి జరుగుతుంది. మంచి సువాసన వచ్చే కొవ్వొత్తులు, ధూపం, అగరబత్తిలని వెలిగిస్తే, చక్కటి ఎనర్జీ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -