Solar Eclipse 2022: ఈరోజు సూర్య గ్రహణం.. ఎక్కడ ఎప్పుడు కనిపిస్తుందంటే..

Solar Eclipse 2022: ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అక్టోబర్ 25న సూర్యగ్రహణం సందర్భంగా మన దేశంలో చాలా నగరాల్లో దీన్ని చూడొచ్చు. చాలా ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన ఖగోళ ఘటన కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి గ్రహణం వచ్చే పదేళ్లలో మళ్లీ కనిపించదని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో చాలా చోట్ల కనిపిస్తుందంటున్నారు.

ఏయే నగరాల్లో కనిపిస్తుందంటే..

మనదేశంలోని రాజధాని నగరం ఢిల్లీతోపాటు జైపూర్, కోల్ కతా, ముంబై, చెన్నై, నాగపూర్, ద్వరక ప్రాంతాల్లో ఈరోజు సూర్య గ్రహణం కనిపిస్తుంది. గ్రహణం సందర్భంగా మనదేశంలోని ప్రజలు మసకబారిన సూర్యుడిని చూడొచ్చు. గ్రహణ సమయంలో 43 శాతం మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. అయితే, సూర్య గ్రహణం సందర్భంగా నేరుగా తిలకించడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

సూర్య గ్రహణం సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. సూర్యుడు తన కక్ష్యలో సాధారణంగా కదులుతుంటాడు. అయితే, సూర్యుడు, భూమి మధ్య చంద్రడు అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు భూమిలో నివసిస్తున్న వారికి కనిపించడు. దీన్నే సూర్యగ్రహణంగా పిలుస్తారు. చంద్రుడు కొన్ని సూర్య కిరణాలను భూమిపైకి రాకుండా అడ్డుకుంటే అలాంటి సందర్భాన్ని పాక్షిక సూర్యగ్రహణంగా పిలుస్తారు.

భారత్ లో తదుపరి సూర్యగ్రహణం 2027 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు అంచనా వేశారు. సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. గ్రహణం ముగిశాక సూతకం పూర్తవుతుంది. ఈ సూతకం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదు. గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రాశి ఫలాల విషయంలో తులారాశి వారికి ఈ సూర్య గ్రహణం అస్సలు బాగోలేదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -