Chicago Love Story: అందహీనంగా ఉన్న అతడిని ఓ అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అదే కారణం!

Chicago Love Story:  నిజమైన.. ప్రేమకు అందం, ఆస్తి అవసరం లేదంటారు. కేవలం ఎదుటి వ్యక్తి మనస్తత్వమే. కోరుకుంటారు. దాన్ని బలంగా నమ్మింది ఓ యువతి. అంతటితో ఊరుకోకుండా దాన్ని అమలు చేసింది కూడా. పుట్టుకతోనే కింది దవడ లేకుండా ఉన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆ నూతన దంపతులు ఈ వార్తకు స్పందించి తమ ప్రేమ గురించి నెటిజన్లకు వివరించారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

చికాగోకు చెందిన జోసెఫ్‌ విలియమ్స్‌ ఓటోఫేషియల్‌ సిండ్రోమ్‌ బారినపడటంతో అతడు కింది దవడ లేకుండానే జన్మించాడు. దాని వల్ల అతడు అంద విహీనంగా కనిపించే వాడు. చిన్నప్పుటి నుంచే అతడితో ఇరుగుపొరుగువారు ఆడుకునేందుకు ఇష్టపడేవారు కాదు.. అతడు వస్తే దూరంగా వెళ్లిపోయేవారు. తనకు ఎదురవుతున్న అవమానాలను తట్టుకుంటూ పెరిగి పెద్దయ్యాడు. ఆ తర్వాత అతడు తనను తాను నమ్మడం మొదలు పెట్టాడు. అందరిలా జీవితాన్ని సరదాగా గడపాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఓ డేటింగ్‌ యాప్‌లో తన ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేశాడు. అతడి ఫొటోలు చూసి చాలా మంది యువతులు.. విలియమ్స్‌ ను రిజెక్ట్‌ చేశారు. కానీ వనియా అనే అందమైన యువతి.. అతడి జీవితంలోకి ఓ వరంలా వచ్చింది. డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన ఆమె విలియమ్స్‌తో డేటింగ్‌ చేసింది. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. ఇది కాస్తా తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారు 2020లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి పెళ్లిని కొందరు వింతగా చూశారు. ’అతడిని ఆమె ఎలా వివాహం చేసుకుంది’ అంటూ కామెంట్‌ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలపై తాజాగా ఈ దంపతులు స్పందించారు. ’విలియమ్‌ను పెళ్లి చేసుకుంటానని తొలుత నేను అనుకోలేదు’ అని వనియా అన్నారు.

అయితే.. అతడి మంచితనానికి లొంగిపోయి పెళ్లి చేసుకున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో విలియమ్స్‌ మాట్లాడు.. ’నేను అందరిలా కాదు. నేనొక డిఫరెంట్‌ వ్యక్తిని అనే విషయం నాకు తెలుసు. కానీ నేనూ మనిషినే. నాకు మనసు ఉంటుంది. అందులో ఫీలింగ్స్‌ ఉంటాయి. అందరిలానే నన్నూ చూడాలని కోరుకుంటున్నా. వేలెత్తి చూపించే ముందు నా వద్దకు వచ్చి నాతో మాట్లాడండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌ కావడంతో ప్రస్తుతం చాలా మంది నెటిజన్లు ప్రేమకు అందం అవసరం లేదు.. మంచి మనస్సు ఉంటే చాలని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -