Rohith Sharma: రోహిత్ శర్మ బ్రేకప్ లవ్ స్టోరీ గురించి తెలుసా?

Rohith Sharma: రోహిత్ శర్మ అనగానే అందరికీ పరుగుల వరద గుర్తుకువస్తుంది. కానీ మనవాడు ప్రేమలో మునిగి ముద్దు మురిపాలు కూడా కురిపించాడు అప్పట్లో. ఇప్పుడు ఆ చిలిపి రోహిత్ చేసిన కొంటె పనులు, ఆడిన సరసాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక మన రోహిత్ కు మైదానంలో బంతులు బౌండరీలు మాత్రమే తెలుసు అనుకుంటే.. మీరు పొరబడినట్లే.. ఎందుకో మీరే చదవండి.

 

రితికాను పెళ్లి చేసుకుని సరదాగా ఫ్యామిలీతో గడుపుతున్న రోహిత్.. అప్పట్లో ఓ పాపతో ప్రేమాయణం నడిపాడట. పది సంవత్సరాల క్రితం 2012 లో లండన్ లోని ఒక క్లబ్ లో బ్రిటిష్ మోడల్ మరియు ఫేమస్ సింగర్ అయిన సోఫియా ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు మన హిట్ మ్యాన్. ఆ తర్వాత మంచి స్నేహితులవ్వడం, అది కాస్త ప్రేమగా మారడం అలా జరిగిపోయాయి. ఇక బాగానే నడిపించినా, బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు.

 

ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా.. వీరిద్దరి ప్రేమను భారీగా ప్రచారం చేసింది. అయితే రోహిత్ గానీ, సోఫియా గానీ ఇద్దరు దీనిపై నోరు విప్పలేదు. కేవలం రూమర్ అన్న మాదిరి వ్యవహరించేవారు. సైలెంట్ గా ఏ విషయం క్లోజ్ అయిందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయంపై సోఫియా బహిరంగ ప్రకటన చేయడంతో అందరికీ తెలిసిపోయింది.

 

అలా చెప్పడం నచ్చలేదు
చాలా రోజులు సజావుగా సాగిన ఈ ప్రేమాయణం 2015 లో బ్రేకప్ అయ్యిందట. అయితే దానికి కారణం కూడా రోహిత్ అని చెప్పింది సోఫియా. “నా గురించి మీడియా వాళ్లు రోహిత్ ను ఏమడిగినా.. సోఫియా నా ఫ్యాన్‌ అనే చెప్పాడు తప్ప లవ్‌ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్‌ చేసేసుకున్నా” అని వాపోయింది సోఫియా. ఇక తాను పరిచయం అయ్యేటప్పటికి అతనొక క్రికెటర్ అని సోఫియాకు తెలియదట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -