Darshan: వైరల్ అవుతున్న దర్శన్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Darshan: సాధారణంగా ఏదైనా ఒక విషయం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఇదే విషయం సెలబ్రిటీలు సామాన్యులు ప్రతీ ఒక్కరి విషయంలో వర్తిస్తూ ఉంటుంది. అయితే కొందరు సెలబ్రిటీలు ఆవేశంలో లేదంటే సంతోషంలో కొన్ని రకాల మాటలను తొందరగా తూలుతూ ఉంటారు. వాటి ద్వారా విమర్శలను కాంట్రవర్సీలను ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో కూడా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదానికి దారితీసాయి. అసలేం జరిగిందంటే.. కన్నడ హీరో దర్శన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. అదృష్ట దేవత ప్రతిసారి తలుపు తట్టదు.. తలుపు తట్టినప్పుడు చేయి పట్టుకొని బెడ్ రూమ్ లోకి లాక్కెళ్ళాలి. ఆమె బట్టలు విప్పి నగ్నంగా చేయాలి. బట్టలు ఇస్తే అవి ధరించి బయటకు వెళ్ళిపోతుంది. అంటూ దర్శన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో హిందువులు, మహిళా సంఘాలు అలాగే పలువురు దర్శన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దానిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా భారతదేశంలో హిందువులు శ్రీలక్ష్మిని అదృష్ట దేవతగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా లక్ష్మి నీ విష్ణుమూర్తి భార్యగా పూజిస్తూ ఉంటారు. అటువంటిది అదృష్ట దేవత పట్ల దర్శన్ అలాంటి వ్యాఖ్యలు చేయడంతో హిందువులు మండిపడుతున్నారు. దర్శన్ చేసిన వ్యాఖ్యలు హిందూ వర్గాల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మహిళా సంఘాలు కూడా స్త్రీని వివస్త్రను చేయాలని ఎలా చెబుతారు అంటూ హీరో దర్శన్ పై మండిపడుతున్నారు. అయితే దర్శన్ ఆ వ్యాఖ్యలు దేనిని ఉద్దేశించిన చేశాడు అన్న విషయం తెలియదు కానీ ఆ వాక్యలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో పాటు పెద్ద కాంట్రవర్సీకి దారి తీసాయి. మరి ఈ వివాదం పై హీరో దర్శన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -