Daughter-Fathers: తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుందా? లేదా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Daughter-Fathers: తండ్రి ఆస్తిలో కూతురికి వాటా ఉంటుందా.. ఉండదా? అనేది ఎప్పటినుంచో ఉన్న వాదన. అయితే కట్నం ఇచ్చాం కదా ఇంకా ఆడపిల్లకి వాటా ఏంటి అనేది అన్నదమ్ముల వాదన. దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇలాంటి గొడవలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే టిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం ఆస్తి పంపకాల విషయంలో కోర్టులో 15 డిసెంబర్ 2021 వరకు 4.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి.

వీటిలో ఎక్కువ శాతం భూమి పంపకాలకు సంబంధించినవే. ఈ కేసులు పరిష్కారం కావడానికి కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది. అయితే ఈ హిందూ వారసత్వ చట్టాన్ని 2005లో సవరించారు. ఈ చట్టం ప్రకారం పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా ఉంటుంది. కూతురికి పెళ్లి అయినప్పటికీ కూడా ఆమెకి ఆస్తిలో వాటా ఉంటుంది.అయితే ఇక్కడ షరతు ఏమిటంటే 2005 సెప్టెంబర్ 9 వరకు ఆ తండ్రి జీవించి ఉంటేనే కుమార్తె పూర్వీకుల ఆస్తిలో వాటా పొందవచ్చు.

2020 లో సుప్రీంకోర్టు మళ్లీ వారసత్వ చట్టాన్ని మార్చింది. 2005 కంటే ముందు తండ్రి మరణించినప్పటికీ కుమార్తెకు తన పూర్వీకుల ఆస్తిపై కుమార్తెలకు హక్కు ఉంటుంది.అలాగే తను సంపాదించిన ఆస్తి కుమార్తెకు ఇవ్వాలా వద్దా అనేది తండ్రి కోరిక ప్రకారమే జరుగుతుంది. కానీ వీలునామా రాయకుండా తండ్రి చనిపోతే కూతురు కూడా ఆ ఆస్తిలో భాగం పంచుకోవచ్చు.

అయితే ఆస్తి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది బహుమతి పొందిన ఆస్తి కాగా రెండవది స్వీయ ఆర్జిత ఆస్తి. కూతురు తన తండ్రి వారసత్వ ఆస్తిలో హక్కులను కలిగి ఉన్నప్పటికీ స్వీయ ఆర్జిత ఆస్తిలో కూతురు వాటా తక్కువగా ఉండవచ్చు. అలాగే ఆస్తిని ఎవరికైనా బదిలీ చేసే అధికారం ఆ తండ్రికి కూడా ఉంటుంది. కూతురికి కాకుండా ఆ తండ్రి నచ్చినవారికి ఆస్తిని పంచుకునే విచక్షణ తండ్రికి ఉంటుంది. కాబట్టి ఆస్తి సమస్యలకు పరిష్కారం దొరకాలంటే చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -