AP: ఏపీ అభివృద్ధి కోసం ఎక్కువగా బాబే కష్టపడ్డారా.. ఏమైందంటే?

AP: చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఏపీని మోడీ దగ్గర తాకట్టు పెట్టరని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ఇక షర్మిల వచ్చిన తర్వాత రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఏపీని ఢిల్లీ పెద్దలకు ధారాదత్తం చేశారని విమర్శలు చేస్తున్నారు. జగన్ పై చంద్రబాబు.. చంద్రబాబుపై జగన్ విమర్శలు చేసుకోవడం తప్ప మోడీని నిలదీసిన పరిస్థితి లేదని మండిపడుతున్నారు. షర్మిల కామెంట్స్ తో ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏపీకి ఎవరిని ఎన్నుకుంటే మంచిదని లెక్కలు వేసుకుంటున్నారు. షర్మిల కామెంట్స్ తో ఆలోచనలో పడిన ప్రజలు ఆమెను సీఎం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే.. కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో బలంగా లేదు. కాబట్టి.. మళ్లీ చంద్రబాబు లేదా జగన్ నే ఎన్నుకోవాలి. అయితే, షర్మిల చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉంది? అసలు ఏపీకి చంద్రబాబు, జగన్ ఏం చేయలేదా? కొద్దొగొప్పో అయినా ఎవరు చేశారు.. అనే ప్రశ్నలు వేసుకుంటున్నారు.

గత పదేళ్లలో ఏపీలో ఇద్దరు సీఎంలు పని చేశారు. కేంద్రంలో మాత్రం ప్రధానిగా మోడీయే ఉన్నారు. అంటే.. ఢిల్లీలో ఒకే ప్రభుత్వం ఉంది కనుక.. అక్కడ ఎవరు ఎక్కువ పలుకుబడి చూపించారు? ఎక్కువ నిధులు ఎవరు తీసుకొచ్చారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. 2014 నుంచి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అంతే కాదు.. ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నారు. దీంతో.. కేంద్రంలో టీడీపీకి రెండు మంత్రి పదవులు వచ్చాయి. సీఎంగా ఉంటూ చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. మరి ఢిల్లీ వెళ్లి ఏం తీసుకొని వచ్చారు అంటే.. పోలవరం పూర్తికాకపోయినా.. 73 శాతం పనులను పూర్తి చేశారు. నిజానికి పోలవరంపై ఆశలు చిగురించాయి అంటే కారణం 2014 తర్వాతే అని చెప్పాలి. కొన్ని ఏళ్లు పాటు వెనబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా కేంద్రం కేటాయించింది. ప్రత్యేకహోదా ఇస్తామని మొదట ప్రకటించింది. కానీ, ఆ తర్వాత హోదాకు బదులు ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత పరిణామాలతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. దీంతో.. ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది అనే ప్రస్తావన కూడా లేకుండా పోయింది. టీడీపీ హయాంలోనే విశాఖకు రైల్వే జోన్ ప్రకటన కూడా వచ్చింది. అది కూడా తమ వలనేనని టీడీపీ నేతలు చెబుతున్నారు.

 

 

ఇక 2019లో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. కేంద్రంతో చాలా సఖ్యతగా ఉన్నారు. 2014-19 మధ్య బీజేపీ, టీడీపీ మధ్య కొన్ని వివాదాలు, విభేదాలు వచ్చినా.. 2019 తర్వాత వైసీపీ, బీజేపీ మధ్య మాత్రం అలాంటి పరిస్థితి లేదు. వైసీపీకి చెందిన ఎంపీలు.. అన్ని రకాలుగా బీజేపీకి సపోర్టు చేశారు. మరి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు అనే అడిగితే.. పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చామని వైసీపీ నేతలు చెబుతారు. కానీ, విభజన హామీల విషయంలో చంద్రబాబు కంటే ఘోరంగా విఫలమయ్యారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోద తీసుకొస్తామని చెప్పిన జగన్.. కనీసం ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇక, టీడీపీ హయంలో ప్రకటన వచ్చిన రైల్వే జోన్.. ఆ తర్వాత కాలంలో లేకుండా పోయింది. టీడీపీ హయంలో పోలవరం కాస్త ముందుకు కదిలినట్టు కనిపించినా ఈ ఐదేళ్లలో మాత్రం దాని ఊసే లేదు. జగన్ సీఎం హోదాలో ఇప్పటి వరకూ 24 సార్లు ఢిల్లీకి వెళ్లారు. సరే కేంద్రం నుంచి ఏం తీసుకొని రాలేదు సరికదా.. రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేశారా? అంటే ఏపీలో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి కనుచూపు మేరలో కూడా లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -