Sridevi: ఉండవల్లి శ్రీదేవిని జగన్ అందుకే దూరం పెట్టారా?

Sridevi: ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం వేడివేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కొన్ని ప్రదేశాలలో టీడీపీ గెలవడంతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారు అంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్సిపి వేటు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్‌ చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

 

వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే పార్టీతో వరికున్న విభేదాలను బాహ్యంగానే తెలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా మేకపాటి కూడా కుటుంబ వివాదాలతోనే పార్టీతో విభేదిస్తున్నారు. ఈ ముగ్గురి సంగతి పక్కన పెడితే ఏ కారణం లేకుండా ఉండవల్లి శ్రీదేవిని ఎందుకు సీఎం జగన్ దూరం పెడుతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయం గురించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ విషయంలో అనేక రకాల అనేక రకాల అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా గుంటూరు జిల్లా లోని తాడికొండ నియోజకవర్గానికి చాలా ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. ఎస్సీ రిజర్వర్డ్‌ అయిన ఈ స్థానం నుంచి గతంలో గొప్ప గొప్ప నాయకులు వచ్చారు. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ చొరవతో ఉండవల్లి శ్రీదేవి తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై విజయం సాధించింది. కాగా శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. ప్రజలకు అస్సలు అందుబాటులో ఉండటం లేదన్న చెడ్డ పేరును కూడా మూటగట్టుకున్నారు. కాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్యవకర్తగా నియామించారని చెబుతున్నారు.

 

కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉండవల్లి ఆమె అనుచరులు తాడికొండలో నిరసనలకు దిగారు. తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం జగన్ గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమించారు. నియోజకవర్గంలో పార్టీని గెలిపించే బాధ్యతను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ టికెట్ ను డొక్కా కే ఇస్తారు అంటూ అప్పట్లో బాగానే ప్రచారాలు జరిగాయి. అందుకే ఉండవల్లి శ్రీదేవి ఇష్టారీతిన ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజలకు దూరమవ్వడం, ప్రతి విషయంలో నాకేంటి? అనే ధోరణి ప్రదర్శించే వారని ఆరోపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -