CM Jagan – Dilraju: ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్న దిల్ రాజు.. సినీ. పొలిటికల్ లెక్కలు మారబోతున్నాయా?

CM Jagan – Dilraju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకరిగా రాణిస్తూ దూసుకుపోతున్నారు దిల్ రాజు. కాగా దిల్ రాజు ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ హయ్యస్ట్ పవర్డ్ బాడీకి అధ్యక్షుడు. టాలీవుడ్ లో అన్ని సెక్టార్లు కలిసి ఆయనను ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే దీని వెనుక చాలా ఎక్సర్ సైజ్ జరిగింది. అల్లు అరవింద్ లాంటి పెద్దలు చక్రం తిప్పారు.

అంతేకాకుండా దీని వెనుక ఇంకా చాలా మంది కృషి వుంది. అంత మంది సహకారం పొందడం అన్నది దిల్ రాజు ప్లానింగ్ కు నిదర్శనం. ఇప్పుడు ఈ జోష్ లోనే ఇండస్ట్రీ జనాలకు భారీ పార్టీ కూడా ఇచ్చేసారు దిల్ రాజు. కాగా ప్రస్తుతం దిల్ రాజు రెండు రాష్ట్రాల సీఎం లను కలిసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది. అపాయింట్ మెంట్ దొరికితే ఫిక్స్ అయితే వెళ్లి కలిసి, ఆంధ్ర ప్రభుత్వం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ఏం కోరుకుంటోందో చెప్పి, సానుకూల వార్తలతో వెనక్కు రావాలని అనుకుంటున్నారు దిల్ రాజు.

 

ప్రస్తుతం ఇదే వార్తలం సోషల్ మీడియా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ ల సమస్య తరువాత టాలీవుడ్ జనాలు ఎవ్వరూ ఏపీ సీఎం ను కలవలేదు. ఇప్పుడు దిల్ రాజు వెళ్లడం అన్నది ఇంట్రస్టింగ్ గా ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ సమస్యలు ఏవి వున్నా, ఆంధ్ర సీఎం సానుకూలంగా స్పందించే అవకాశం వుంది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -