Chandramukhi 2: రజనీకాంత్ లారెన్స్ కాంబినేషన్ లో చంద్రముఖి3 మూవీ.. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అంటూ?

Chandramukhi 2: దాదాపు 17 సంవత్సరాల క్రితం పి వాస్తు దర్శకత్వంలో రజనీకాంత్ జ్యోతిక నయనతార ప్రభు వంటి నటీనటులు ప్రధాన పాత్రలో నటించిన్న చిత్రం చంద్రముఖి ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. అయితే 17 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా చంద్రముఖి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీ విడుదల కాబోతుందని ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీకి దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాని వాయిదా వేశారు.

ఇలా ఈ సినిమా చివరి క్షణంలో వాయిదా పడటానికి సరైన కారణం తెలియక పోయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిందన్న వార్త మాత్రమే వైరల్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ పి వాసు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి గల కారణాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మేమంతా ఈ సినిమాను చూసి సెప్టెంబర్ 15వ తేదీ విడుదల చేయాలని భావించాము.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఒకరోజు రాత్రి నాకు ఎడిటింగ్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది దాదాపు 480 ఫైల్స్ కనిపించలేదు అంటూ ఫోన్ వచ్చింది దీంతో ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి అనే వెతకడం కోసం ఈ సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది అంతకుమించి ఈ సినిమా వాయిదా పడడానికి వేరే కారణాలు ఏవి లేవని తెలిపారు.

ఇక చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు నటించారు ఆయన ఆశీస్సులతో ఇప్పుడు లారెన్స్ నటిస్తున్నారు తప్పకుండా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని పి వాసు వెల్లడించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా చంద్రముఖి 3 కూడా చేసే ఆలోచనలో ఉన్నారా ఒకవేళ చేస్తే ఈ సినిమాలో రజనీకాంత్ లారెన్స్ నటించబోతున్నారా అన్న ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పి వాసు సరైన సమాధానం చెప్పకపోయినా కథ నచ్చితే రజినీకాంత్ గారు ఎలాంటి సినిమాలో అయినా నటించడానికి సిద్ధంగా ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ రజినీకాంత్ లారెన్స్ కనుక కలిసి నటిస్తే సినిమా మరో లెవల్లో ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -