Chandramukhi 2: లారెన్స్ కోరుకున్న సక్సెస్ చంద్రముఖి2 తో దక్కడం ఖాయమేనా?

Chandramukhi 2: రజనీకాంత్ ప్రధానపాత్రలో నటించిన చంద్రముఖి సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఆ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పార్ట్ వన్ విడుదల అయ్యి దాదాపు 17 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ 17 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. చంద్రముఖి 2పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని వదిలారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని వినాయక చవితి పండుగ రోజు విడుదల చేయబోతున్నట్లుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ విషయాన్ని తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్ లో హీరో రాఘవ లారెన్స్ ఒక తలుపు వైపు తీక్షణంగా చూస్తున్నారు. ఆ తలుపు హోల్‌లో నుంచి ఒక వెలుగు బయటికి వస్తోంది. తలుపు నిండా మంత్రించిన త్రిశూలంతో పాటు కొన్ని యంత్రాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు.

 

సినిమా పోస్టర్ ని చూసిన తర్వాత అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీకు డైరెక్ట‌ర్ పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌, వడివేలు, రాధిక లాంటి నటీనటులు కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సుభాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే చంద్రముఖి పార్ట్ 1లో రజనీకాంత్‌, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రెండో భాగంపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -