Pawan Kalyan: ప్రజలకు ఈ బాధ్యత లేని పవన్ కళ్యాణ్ అవసరమా?

Pawan Kalyan: తెలుగు నాట సినిమాల ద్వారా, ఈ మధ్యన రాజకీయాల ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. గతంలో తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యంలో కీలక రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్.. సొంతంగా జనసేన పేరుతో ఓ పార్టీని స్థాపించి.. దాని కోసం పని చేస్తుండటం తెలిసిందే. అయితే జనసేనను పవన్ కళ్యాణ్ నడుపుతున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలగిస్తోంది.

 

 

చిత్తు శుద్ధి లేకుండా రాజకీయ పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలు ఆరోపించినట్లు రాజకీయ టూర్ చేసే పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎలా మేలు చేస్తాడనే సందేహం కలుగుతుంది. ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగిన వాడే నాయకుడు అవుతాడు. అయితే అంతకంటే ముందు నాయకుడికి తన గురించి తనకు బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా ఉంటే అది సరైన మార్గంలో ఉన్నట్లు కాదు.

 

 

 

మొన్నీ మధ్యనే పవన్ కళ్యాణ్.. మంగళగిరి నుండి ఇప్పటం గ్రామానికి కారు టాప్ మీద కూర్చొని వెళ్లిన వీడియో వైరల్ అయింది. అయితే నేషనల్ హైవే మీద ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోతేనే ఫైన్లు వేసే రూల్స్ మనకు ఉన్నాయి.. కానీ పవన్ మాత్రం అదేదో సినిమాలో చూపించే హీరోయిజాన్ని రియల్ లైఫ్ లో చూపించే ప్రయత్నం చేశాడు.

 

 

రూల్స్ చేయాలనుకునే వాడు, ముందు వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. నాయకుడు అనే వాడు ముందు తప్పు లేకుండా జాగ్రత్తపడాలి. పది మందికి ఆదర్శంగా నిలవాలి. కానీ ఒకవేళ అతడే గాడితప్పి రూల్స్ ను బ్రేక్ చేస్తే.. అతడిని అనుసరించే వాళ్లు ఏం చేయాలి? ప్రజలు ఆ నాయకుడి నుండి ఏం నేర్చోవాలి? ఇప్పుడు పవన్ నుండి ఏం నేర్చుకోవాలి? ఆయనలా ప్రజలు కూడా ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేయాలా? అనే దానికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -