House: మీ ఇంట్లో అగ్నేయ దిశలో వీటిని ఉంచారా.. మిమ్మల్ని దరిద్రం వెంటాడటానికి అదే కారణమంటూ?

House: వాస్తు శాస్త్రంలో ఇంటిని ఏ విధంగా నిర్మించుకోవాలో చెప్పబడింది. ఈ వాస్తు నియమాలని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అన్ని రకాల వాస్తు దోషాలను వదిలించుకోవచ్చు. ఇంటిని నిర్మించుకోవడానికి ఏ దిక్కు శుభం, ఇంటి లోపల ఏ వస్తువుల్ని ఉంచడానికి ఏ ప్రదేశం శుభప్రదం అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే ఆగ్నేయ దిశలో ఏ వస్తువులు పెట్టవచ్చు, ఏ వస్తువులు పెట్టకూడదు అని తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు, దక్షిణాల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆగ్నేయ దిశ అంటారు.

ఈ దిశ వైపు సూర్యుని కిరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది వెచ్చగా ఉంటుంది. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగినా, గోతులున్నా, ద్వారం ఉన్నా దోషం అంటారు. తూర్పు వీధి దక్షిణం వీధి గల గృహము ఆగ్నేయ గృహము అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఇంట్లో నివసించే వారికి దుష్ఫలితాలు ఎక్కువ. ఇన్వెర్టర్లు, నీటి కొలిమిలు, బాయిలర్లు, బోరింగు వాటర్ ట్యాంక్ చేతి పంపు కొళాయిలు ఈ దిశలో ఉంచకూడదు. అలాగే భూగర్భ నీటి ట్యాంకులను కూడా ఈ దిశలో ఉంచకూడదు.

 

ఎందుకంటే ఈ అంశాలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇది ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే వాస్తు ప్రకారం వివాహితులు తమ మంచాన్ని ఆగ్నేయ కోణంలో ఉంచకూడదు. ఎందుకంటే వివాహితులు ఈ దిక్కున నిద్రిస్తే వైవాహిక జీవితం పై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఇంటికి ఆగ్నేయ ప్రాంతం వైపు నీలం రంగు ఉండకుండా చూసుకోవాలి.

 

ఈ దిశ వైపు లేత నారింజ గులాబీ రంగులను ఉపయోగించండి. అగ్నికి సంబంధించిన గృహాపకరణాలు ఇంట్లో వీలయినంతవరకు ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇంట్లో అమర్చిన ఎలక్ట్రికల్ ఉపకరణాలు సరిగ్గా నిర్వహించబడాలి. వాటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్దం రాకుండా చూసుకోండి. అలాగే వాస్తు ప్రకారం అరటి చెట్టుని ఆగ్నేయ దిశలో నాటకూడదు. అలాగే పరమట దిక్కున కూడా నాటకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు సంభవించడమే కాకుండా దరిద్రం వెంటాడుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -