Khushboo: నటి కుష్బూ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు ఇవే!

Khushboo: కుష్బూ ఒక భారతీయ నటి. చలనచిత్ర నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యత. రాజకీయ నాయకురాలు. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో నటించింది. ఈమె ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది.ఈమె దర్శకుడు సి. సుందర్ ను వివాహం చేసుకుంది. 1980లో ది బర్నింగ్ ట్రైన్ ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా హిందీ చిత్రంలో నటించడం జరిగింది.

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని వరుస సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు, ప్రశంసలు పొందింది. 1986లో కలియుగ పాండవులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. 1991లో తమిళ చిత్రం ధర్మతిన్ తలైవాన్ లో ప్రభు సరసన నటించి, వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది నాలుగు సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్ లో కూడా ఉన్నారు.

కానీ ప్రభు తండ్రి దీనికి ఒప్పుకోకపోవడంతో విడిపోయి 2000 సంవత్సరంలో దర్శకుడు సి.సుందర్ ను వివాహం చేసుకుంది. ఈమె 2010లో అన్న డీఎంకే పార్టీలో చేరింది. ఆ తర్వాత 2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2020లో కాంగ్రెస్ పార్టీని వీడి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ముందు 2021 లో బిజెపిలో చేరడం జరిగింది.

ఇక కుష్బూ నిజజీవితంలో కళ్ళ ముందు ఒక పెద్ద ప్రమాదం జరిగి కొందరు పిల్లలు చనిపోవడంతో ఆ సంఘటన జీర్ణించుకోలేక ఆమె హిందూ మతాన్ని స్వీకరించింది. కుష్బూ తమిళ ఇండస్ట్రీలోనే అగ్రనటిగా గుర్తింపు పొందింది. తన అభిమానులు ఏకంగా తనకు గుడి కట్టించారు. ఇలాంటి ఘనత భారతదేశంలో పొందిన ఏకైక నటి ఈమెనే.

తన భర్త సి సుందర్ తనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడని, తన భర్తకు తనకంటే సౌందర్య అంటే ఇష్టమని సరదాగా ఓ సందర్భంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కుష్బూ రాజకీయాలలో రాణించాలని అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -