Khushboo: ప్రభు, ఖుష్బూ విడిపోవడం వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా?

Khushboo: ఖుష్బూ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలో ఈమె స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన విషయం మనందరికీ తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ ఆ తర్వాత టాప్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది. అలా ఈమె ఒకటి రెండు సినిమాలలో కాదు 200 కు పైగా సినిమాలలో నటించింది. కాగా ఖుష్బూ 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ హిట్ ను అందుకుంది.

ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్‌ ఫిలింఫేర్‌ అవార్డు సైతం అందుకుంది. తమిళ అభిమానులు ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టించారంటే ఆమెకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా చిన్న తంబీ సినిమాలో తనతో జోడీ కట్టిన ప్రభుతో ఆమె ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు జోరుగా పంపించాను. ఇక ఆ వార్తలను ఆ ఊహాగానాలను నిజం చేస్తూ 1993 సెప్టెంబర్‌ 12న వీరి పెళ్లి జరిగింది. పోయిస్‌ గార్డెన్‌లో వీరు కొనుగోలు చేసిన ఇంట్లోనే వీరి వివాహం కూడా జరిగింది. కానీ అప్పటికే ప్రభుకు పెళ్లైంది. దీంతో వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్‌ సహా అతడి కుటుంబం అంగీకరించలేదు. ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.

అయితే పెళ్లికి ముందే ప్రభుతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేసినట్లు ఆమెనే గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభు, ఖుష్బూల బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సీనియర్‌ నటి కాకినాడ శ్యామల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ఖుష్బూ, ప్రభు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వీరి ప్రేమను ప్రభు భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారికి గొడవలయ్యాయి. అందుకే ఈ గొడవలన్నీ వద్దని తెగదెంపులు చేసుకున్నారుఅని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -