Yatra 2: యాత్ర2 సినిమా వల్ల వైసీపీకి కలిగిన నష్టం ఎంతో మీకు తెలుసా?

Yatra 2: రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఏదైనా సినిమాను విడుదల చేస్తే అది వారికి ఎంతో కొంత మైలేజ్ పెంచాలి. ఒక్కో సారి వర్క్ అవుట్ కాకాపోతే బ్యాడ్ లక్ అనుకుంటారు. కానీ, మైలేజ్ పెంచుతుందనుకున్న ఆ సినిమా మరింత ఇబ్బందుల్లో నెట్టేస్తే.. ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పుడు ఏపీలో యాత్ర2 సినిమా విడుదలైంది. ఈ సినిమా వైసీపీకి ఎంతో కొంత మేలు చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా తర్వాత జరిగిన పరిణామాలు వైసీపీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి.

 

ఈ సినిమా అసలు ఏమాత్రం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. ముందుగానే ఊహించారో ఏమో కానీ వైసీపీ అధినేత జగన్.. టికెట్లు ఉచితంగా పంచి ప్రజలను థియేటర్లకు తరలించాలని ఎమ్మెల్యేలకు, అభ్యర్థులకు సూచించారు. కొంతమంది జగన్ మాటను పెడ చెవిన పెట్టగా.. మరికొంత మంది టికెట్లు పంచిపెట్టారు. టికెట్లు ఉచితంగా ఇచ్చినా సినిమా చూడటానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. మొదటి షోతో సినిమా టాక్ బయటకు రావడంతో.. ఫ్రీ టికెట్లు ఇచ్చినా చూడలేదు. ఈ వ్యవహారంల వైసీపీలో చిచ్చు పెట్టింది. ఇవాళ ఈ మాత్రం జనాలను థియేటర్లకు రప్పించుకోలేకపోతే.. రేపు ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకూ ఎలా తీసుకెళ్తారని జగన్ ఆ పార్టీ నేతలపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే.. సినిమాలో విషయం లేనపుడు తామేం చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సొంత డబ్బులతో టికెట్లు పంపిణీ చేసి కూడా మాకెందుకు మాటలు అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

మరోవైపు రూ. 40 కోట్లతో సినిమాను తీస్తే.. కనీసం రూ. 10 కోట్లు కూడా వసూళ్లు రాలేదని తెలుస్తోంది. ఇది కూడా ఓ నెగెటివ్ ప్రచారానికి కారణవుతోంది. ఇక ఈ సినిమాలో డైలాగ్‌లు, సీన్లతో తిరిగి వైసీపీని, జగన్ నే టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమా డైరెక్టర్ ప్రస్తుతం అటు ఇండస్ట్రీలో, ఇటు ఏపీ రాజకీయాల్లో చర్చకు కేంద్రం బిందువుగా మారారు. డైరక్టర్ మహి వి రాఘవకు ఈసినిమా తీసినందుకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల భూమి ఉచితంగా ప్రభుత్వం కట్టబెట్టిందని టాక్ నడుస్తోంది. ప్రజలు సొత్తు అలా ఎలా ధారదత్తం చేస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద ఎనలేని సేవలు చేస్తే వారికి భూమి ఇస్తే ఇండస్ట్రీ అభివృద్దికి ఉపయోగపడుతోందని అనుకోవచ్చు. కానీ, మహి వి రాఘవ అంటే ఎవరికీ సరిగా తెలియదు అలాంటి వ్యక్తికి ప్రభుత్వ భూమి ఇవ్వడంతో జగన్‌పై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో, టీడీపీ నేతలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆ యాత్ర సినిమా ఎందుకు తీయాలి? ఎందుకు పరువు పోగొట్టుకోవాలని ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -