Krishnashtami: కృష్ణాష్టమి రోజున కన్నయ్యను ఎలా పూజించాలో మీకు తెలుసా.. అస్సలు చెయ్యకూడని తప్పులివే!

Krishnashtami: నేడు కృష్ణాష్టమి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున చాలామంది శ్రీకృష్ణుని మందిరాలకు వెళ్లి శ్రీకృష్ణుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇక ఇంట్లో కొందరు చిన్న పిల్లలు పసిపిల్లలు ఉండే వారిని కృష్ణుడి గెటప్ లో తయారు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ రోజున, ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుంటారు. కృష్ణుడి తండ్రి అయిన వాసుదేవుడు, కృష్ణుడిని సురక్షితంగా ఉంచటానికి, వానహోరులో యమునా నదిని దాటుకుంటూ అతన్ని నందుని ఇంటికి చేర్చాడు.

విష్ణు భగవానుని ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు, భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి జన్మించాడు. అయితే కృష్ణాష్టమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు అంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జన్మాష్టమి రోజున, తులసి ఆకులను కోయరాదు. తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. తులసి విష్ణువుని వివాహం చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేసింది. అయితే, తులసి ఆకులను విష్ణువుకు సమర్పించడానికైతే మాత్రం కోయవచ్చు. కృష్ణుడు అందరిని ఆర్థిక హోదాతో సంబంధం లేకుండా ప్రేమిస్తాడు. అతని ప్రియమిత్రుడైన సుధాముడు, పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు.

కనుక ఈ రోజున, పేదలను అవమానించడం, కృష్ణుడిని అసంతృప్తికి లోనుచేస్తుంది. పేదవారిని అగౌరవ పరచడం, శని దేవునికి కోపాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ రోజున అగౌరవపరచకుండా, పేదలను సత్కరించాలి. వీలైతే, జన్మాష్టమి నాడు పేదలకు విరాళం ఇవ్వాలి. జన్మాష్టమి నాడు చెట్లను నరకడం కూడా దురదృష్టకరం అని భావిస్తారు. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. మహాభారతం ఎనిమిదవ అధ్యాయంలో కృష్ణుడు తాను అన్నింటా అంతా ఉన్నానని, ఆయనలో అంతా ఉన్నాడని తెలిపాడు. కనుక, ఈ రోజున మనం ఎవరికైనా హాని తలపెట్టే, ఆలోచన కూడా చేయకూడదు.

కృష్ణాష్టమి రోజున మాంసాహారం తినకూడదు. జన్మాష్టమి నాడు బ్రహ్మచార్యం పాటించాలి. ఈనాడు శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. ఈ రోజున పవిత్రమైన తనుమనస్సులతో కృష్ణుడిని పూజించాలి. కృష్ణుడిని తరచుగా గోపాలకుడిగా చిత్రీకరిస్తారు. అతను తన చిన్ననాటి సమయంలో, ఆవులతో దూడలతో ఆడుతున్న చిత్రాలు, ఆయనకు ఆవులు ఎంత ప్రియమైనవో తెలియజేస్తున్నాయి. ఆవులను పూజించే వ్యక్తికి, తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆవులను అగౌరవపరిస్తే, కృష్ణుడిని అసంతృప్తికి గురిచేసినట్లే అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -