Telugu movies: వీక్ క్లైమాక్స్ వల్ల ఫ్లాపైన తెలుగు సినిమాలేంటో తెలుసా?

Telugu movies: సాధారణంగా కొన్ని సినిమాలు మొదటినుంచి ఎంతో ఉత్సాహంగా ఆసక్తికరంగా ఉండి క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకులను తీవ్ర నిరాశ పరుస్తూ ఉంటాయి. ఇలా క్లైమాక్స్ పెద్దగాప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఎన్నో సినిమాలు ఫెయిల్యూర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీక్ క్లైమాక్స్ కారణంగా ఫ్లాప్ అయినటువంటి ఈ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

శీను: విక్టరీ వెంకటేష్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ కన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం శీను.ఈ సినిమా మొదటినుంచి ప్రేక్షకులలో ఎంతో ఆసక్తిని కలిగించింది ఇందులో వెంకటేష్ మూగవాడిగా నటిస్తాడు అయితే హీరోయిన్ కోసం క్లైమాక్స్ లో నిజంగానే మూగవాడిగా మారడంతో ప్రేక్షకులకు అది నచ్చలేదని చెప్పాలి.

 

వేదం: అల్లు అర్జున్ అనుష్క మంచు మనోజ్ నటించిన ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ చివరిలో మంచు మనోజ్ అల్లు అర్జున్ చనిపోవడంతో ఈ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయింది.

 

చక్రం: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం చక్రం ఇందులో ప్రభాస్ క్యాన్సర్ పేషెంట్ గా కనిపిస్తారు.ఇందులో జగమంత కుటుంబం అనే పాట ఇప్పటికే ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది అయితే ఇందులో కూడా ప్రభాస్ చనిపోవడం ప్రేక్షకుల జీర్ణించుకోలేకపోయారు.

 

భీమిలి కబడ్డీ జట్టు: నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా భీమిలి కబడ్డీ జట్టు. ఈ చిత్రం మొదటి సీన్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా నాని క్యారెక్టర్ చనిపోవడంతో సూపర్ హిట్ అవ్వాల్సిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

 

మెరుపు కలలు: ప్రభుదేవా, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్, అరవింద స్వామి కలయికలో వచ్చిన సినిమా మెరుపు కలలు.ఈ సినిమా మొదటినుంచి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ క్లైమాక్స్ లో అరవింద స్వామి తండ్రిగా మారిపోవడం ప్రేక్షకులను
ఆకట్టుకోలేకపోయింది.

 

నక్షత్రం: కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్,సాయిధరమ్ తేజ్ లు హీరోలుగా నటించిన సినిమా నక్షత్రం.ఈ సినిమాలో కూడా హీరో సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ను చంపేయడంతో ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -