Green Tea: గ్రీన్ టీ తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఏకంగా అలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ?

Green Tea: మనలో చాలామందికి ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం అలవాటు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఇందులో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీని రోజువారీ డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రీన్ టీతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు చాలామంది తమ ఆహారంలో భాగంగా గ్రీన్‌ టీ తీసుకుంటారు.

ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్‌ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ తాగవచ్చా ఒకవేళ తాగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రీన్ టీలో కూడా కొద్ది మోతాదులో కెఫిన్ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే, రోజుకు 200 మిల్లీ గ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఉంటుంది. ఒకరకంగా ఇది హెల్తీ డ్రింక్ అయినప్పటికీ, గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో గ్రీన్ టీ తీసుకోకూడదు.

మరి ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో గ్రీన్ టీకి దూరంగా ఉండటం మంచిది. మూడవ త్రైమాసికంలో గ్రీన్ టీని తీసుకోవచ్చు. మరోవైపు కాఫీని అస్సలు తీసుకోకూడదు, ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు గ్రీన్ టీకి దూరంగా ఉంటే మంచిది. లేదంటే అది పాల స్రావాన్ని తగ్గిస్తుంది. కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్‌ టీ తీసుకోకపోవడమే మంచిది. గ్రీన్‌ టీ తాగేవారికి ఇతర మందులతో రియాక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది.అందువల్ల మీరు ఇప్పటికే ఏవైనా ఇతర మందులు వాడుతున్నట్లయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. గ్రీన్‌ టీ అధికంగా తీసుకోవటం వల్ల తలనొప్పి కూడా రావచ్చు. ఇది రక్తపోటును అమాంతం తగ్గించే అవకాశం ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది.అలాగే నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -