Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Green Tea: ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఉదయం లేచిన వెంటనే లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీ లేదంటే కాపీ తాగిన తర్వాతనే వారి పనులను మొదలు పెడుతూ ఉంటారు. ఒక్కరోజు కాఫీ, టీ లు తాగకపోయినా కూడా ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ లేదా కాఫీ ని తాగడం వల్ల రిఫ్రెష్ గా అనిపించడంతో పాటు కాస్త ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే ఆఫీసులలో ఉద్యోగాలు చేసేవారు రెండు మూడు గంటలకు ఒకసారి కాఫీ లేదా టీ ను తాగుతూ ఉంటారు. ఉదయం లేవగానే కాఫీ, టీ, గ్రీన్ టీ, పాలు, బూస్ట్ ఇలా ఒక్కొక్కరు వారికి ఇష్టమైనవి తాగుతూ ఉంటారు.

చాలామందికి ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం అలవాటు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. మరి ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాఫీ లేదా టీ లలో ఏదైనా కానీ మితిమించి తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది ఉదయాన్నే గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటారు. కానీ గ్రీన్ టీని ఖాళీ కడుపుతో అలాగే తాగకూడదు. ఎందుకంటే గ్రీన్ టీ తాగడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. కొందరు రోజుకు 4 నుంచి 5 ఐదుసార్లు గ్రీన్ టీ తాగుతారు. అది అస్సలు మంచిది కాదు.

 

ఇందులో కెఫిన్ 24-25 మిల్లీ గ్రామ్స్ ఉంటుంది. ఒకవేళ రోజుకు ఐదుసార్లు గ్రీన్ టీ తాగితే శరీరంలో కెఫిన్ స్థాయి పెరిగి ఆందోళ‌న‌, భ‌యం, ఛాతిలో మంట, త‌ల‌తిర‌గ‌డం, డ‌యాబెటిస్, నిద్రలేమి వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. పరగడుపున గ్రీన్ టీ తాగితే గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఉదయాన్నే గ్రీన్ టీ తాగాక ముందే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. తర్వాత వెంటనే గ్రీన్ టీ ని తీసుకోకుండా ఒక గంట సేపు అయినా గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్రీన్ టీ ని తాగడం మంచిది. అలాగే ప్రెగ్నెంట్ మహిళలు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోకూడదు. అది బిడ్డ పుట్టిన తర్వాత పాలు రావడంలో ఇబ్బందిగా మారుతుంది. టీని అధికంగా తాగితే బాడీలో ఐర‌న్ త‌గ్గుతుంది. ఐర‌న్ శాతం త‌గ్గితే ర‌క్తం వృద్ది త‌గ్గుతుంది. దీంతో ఐర‌న్ లోపం ఏర్ప‌డుతుంది. రోజుకు గ్రీన్ టీ 2 లేదా 3 సార్లు తాగితే ఉత్తమం. ఎప్పుడైనా సరే తిన్న తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -