రూ. 15 వేలతో ఆ వ్యాపారం చేస్తే లక్ష్యల్లో లాభాలు!

ప్రస్తుల కాలంలో ఉద్యోగాల కన్నా వ్యాపారాలే అధిక లాభాలు ఇస్తున్నాయని అటువైపు అడుగులు వేస్తున్నారు. అయితే కొందరు పెట్టుబడులు లేక సతమతమవుతున్నారు. అయితే ఎకువ పెట్టుబడులు కాకుండా తక్కువ పెట్టుబడులు పెట్టి కూడా అధిక లాభాలు పొందవచ్చు. రూ. లక్ష కన్నా తక్కువే పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి రీసైక్లింగ్‌ బిజినెస్‌.

ప్రతి రోజూ ఇంట్లో చెత్త పేరుకుపోతుంది. ఆ చెత్తను మున్సిపాలిటీ వారు సేకరిస్తారు. అయితే.. అందులో పనికి వచ్చేవి చాలానే ఉంటాయి. వాటిని రీసైక్లింగ్‌ చేస్తే బాగానే సంపాదించవచ్చు. కేవలం రూ.15 వేల పెట్టుబడితో రీసైక్లింగ్‌ బిజినెస్‌ ప్రారంభించవచ్చు. రీసైక్లింగ్‌ వ్యాపారం చాలా పెదదే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 2 బిలియన్‌ టన్నుల కన్నా ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటియాలోనే 277 మిలియన్‌ టన్నులకు పైగానే చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇతర భారీ మొత్తంలో వ్యర్థాలను నిర్వహించడం చాలా కష్టమైన పని. ఈ క్రమంలో ఆ చెత్తను రీసైక్లింగ్‌ చేసి అద్భుతాలు చేస్తున్నారు.ఆ చెత్తతో ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు, వేస్ట్‌ మెటీరియల్‌తో పెయింటింగ్‌లు వంటివి తయారు చేస్తూ నెలకు లక్షల్లో లాభాలు పొందుతున్నారు.

ఈ వ్యాపారాన్ని స్టార్ట్‌ చేసే ముందు మీ పరిసర ప్రాంతంలోని చెత్త, వ్యర్థాలను సేకరించాలి. లేదంటే రోజు చెత్త సేకరించే మున్సిపల్‌ సిబ్బంది నుంచి రూడా వ్యర్థాలను తీసుకోవచ్చు. చెత్తను సేకరించి దాన్ని శుభ్రం చేసి వివిధ రకాల వస్తువులను తయారు చేయవచ్చు. టైర్‌ సీటింగ్‌ చైర్, కప్, ఉడెన్‌ క్రాఫ్ట్, కెటిల్, గ్లాస్, దువ్వెన ఇలా ఎన్నో వస్తువలు తయారు చేసుకోవచ్చు.మీరు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. లేదా మీరే నేరుగా విక్రయించవచ్చు. అది కూడా వీలు కాకపోతే నేటి కాలంలో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో ఉన్నాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ సైట్లో వాటిని విక్రయించవచ్చని ‘ది కబాడీ.కామ్‌ స్టార్టప్‌ యజమాని శుభమ్‌ పేర్కొన్నారు.

ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాడు.. ఎలా సక్సెస్‌ అయ్యారు అనేది శుభం మాటల్లో మొదట్లో ముగ్గురు మిత్రులు కలిసి ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించామని ఇలా ఒక్కో మెట్టు ఎక్కిన శుభమ్‌ ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఒక నెల టర్నోవర్‌ రూ. 8 లక్షల నుంచి దాదాపుగా 10 లక్షలకు చేరుకుందంట. ఈ కంపెనీలు వివిధ ప్రాంతాల నుంచి నెలలో 40– 50 టన్నుల చెత్తను సేకరించి భిన్న విభిన్న రకాల వస్తువులు తయారు చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -