Clay Pot: మట్టి పాత్రల్లో తింటే అలాంటి లాభం.. అదేంటంటే?

Clay Pot: టెక్నాలజీ డెవలప్ అయ్యింది కాలం మారిపోయింది. దీంతో పల్లెటూర్లలో సిటీలలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రిఫ్రిజిరేటర్లు దర్శనమిస్తున్నాయి. అయితే ఇంతకుముందు కాలంలో అయితే ఈ రిఫ్రిజిరేటర్లకు బదులుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మట్టి కుండ ఉండేది. ఆ మట్టి కుండలోనే ఒకప్పుడు నీటిని తాగేవారు. కానీ కాలక్రమంగా మట్టి కుండల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు కూడా ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో అలాగే చలివేంద్రం పెట్టిన చోట మాత్రమే మనకు మట్టి కుండలు కనిపిస్తున్నాయి. అయితే చాలామంది మట్టి కుండలో నీరు తాగడానికి ఇష్టపడరు. కానీ మట్టికుండలోని మంచినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

నీటి నుండి లభించే విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. మట్టి కుండలో నీరు బాగా తాజాగా, చల్లగా ఉంటాయి. ఈ మట్టి కుండలోని నీరు తాగడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. మట్టి కుండలో నిల్వ ఉన్న నీరును తాగినప్పుడు జీవక్రియలకు మంచి శక్తి లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే రిఫ్రిజిరేటర్ లో నీటిని కూల్ చేసుకోవడం అసహజమైన విధానం. దానికి బదులు మట్టికుండలో పోసి నిల్వ ఉంచితే అవే చల్లగా అయిపోతాయి. మట్టి కుండలో నీటిని తాగడం వల్ల వడదెబ్బ నమస్తే కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మట్టి కుండల్లో ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు.

కడుపులో మంట, ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే మట్టి పాత్రలను కేవలం నీటిని తాగడానికి మాత్రమే కాకుండా వంట చేయడానికి ఉపయోగించుకోవడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మట్టి కుండలు ఆల్కలైన్ స్వభావంతో ఉంటాయి. కనుక వండే సమయంలో ఆహారంలోని యాసిడ్ మట్టి పాత్రలోని ఆల్కలైన్ తో చర్యకు గురవుతుంది. ఇది పీహెచ్ స్థాయులను తటస్ఠీకరిస్తుంది. దీనికి తోడు మంచి వాసన కూడా తోడవుతుంది. మట్టి పాత్రల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉండడంవల్ల మంచి రుచి కూడా వస్తుంది. మట్టి పాత్రలకు సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. దీనివల్ల వేడి, తేమ ఆహారం అంతటా సమానంగా విస్తరించేందుకు సాయపడుతుంది. దీనివల్ల ఆహారం ఒకే విధంగా ఉడుకుతుంది. అలాగే అందులోని పోషకాలు వృథాకావు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -