Anant Ambani: అనంత్ అంబానీ బరువు పెరగడం వెనుక షాకింగ్ రీజన్లు తెలుసా?

Anant Ambani: మామూలుగా తక్కువ బరువు ఉన్నవాళ్లు ఎక్కువ బరువు పెరగడం చాలా సులువు. కానీ ఎక్కువ బరువు ఉన్నవాళ్లు తక్కువ బరువు కావడం అనేది చాలా కష్టమైనది. కానీ ఇప్పుడు అది కూడా సులభం అవుతుంది. బాగా వర్క్ అవుట్ లు, కొన్ని రకాల చికిత్సలు తీసుకోవడం వల్ల లావుగా ఉన్న వాళ్ళు కూడా సులువుగా సన్నగా అవుతున్నారు. అయితే వర్క్ అవుట్ ల విషయాలు పక్కకు పెడితే.. చికిత్స తీసుకొని సన్నగా అవ్వటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు కచ్చితంగా ఎదురవుతాయి.

ఇప్పుడు అటువంటిదే అనంత్ అంబానికి ఎదురయింది. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ – నీతా అంబానీ లో చిన్న కుమారుడు అనంత్ అంబానీ కొంతవరకు పరిచయాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా తన బరువు ద్వారా అందరి దృష్టిలో పడ్డాడు. 2013 సంవత్సరంలో ఆయన 200 కిలోల బరువు ఉండగా.. 2016లో 100 కిలోల బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపడేలా చేశాడు. అయితే మళ్లీ ఆయన ఇప్పుడు బరువు పెరిగినట్లు తెలిసింది.

 

ఇటీవలే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో వీరి పెళ్లి జరగనుంది. అయితే వీరి ఎంగేజ్మెంట్ సందర్భంగా దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలలో ఆనంద్ బాగా లావుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ మధ్యనే బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈయన.. ఇప్పుడు మళ్లీ బరువు పెరగటంతో అందరూ మరింత ఆశ్చర్యపోతున్నారు.

 

అయితే దీని గురించి అనంత్ తల్లి నీతా అంబానీ స్పందించింది. గతంలో 200 కిలోల బరువు ఉన్న అనంత్ 100 కిలోల బరువు తగ్గి చాలామందికి రోల్ మోడల్ గా నిలిచాడు అంటూ.. తన కుమారుడు తీవ్రమైన అస్తమాతో బాధపడ్డాడని.. దానికి చికిత్స భాగంగా కొన్ని స్టెరాయిడ్లు తీసుకున్నాడు అని.. అయితే వాటి దుష్ప్రభావాల వల్ల తన కొడుకు మళ్లీ బరువు పెరిగాడు అని తెలిపింది.

 

ఇక తన కొడుకు ప్రతిరోజు 5 నుంచి 6 గంటల పాటు వ్యాయామం చేస్తాడు అని.. యోగాతో పాటు కార్డియో వ్యాయామాలు కూడా చేస్తాడు అని.. తన కుమారుడిలాగు ఉబకాయంతో పోరాడుతున్న వాళ్ళు చుట్టూ చాలామంది ఉంటారు అని.. అలాంటి వాటిని చిన్నచూపు చూడకండి అంటూ తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -