Jackie Shroff: ప్రముఖ టాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ సక్సెస్ స్టోరీ తెలుసా?

Jackie Shroff: బాలీవుడ్ సూపర్ స్టార్లలో జాకీష్రాఫ్ ఒకరు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ ని ఏలుతున్న యాక్టర్స్ లలో ఈయన కూడా ఒకరు. 1983లో హీరో సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన జాకీష్రాఫ్ ఇప్పటివరకు ఏకధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆయనకి మొదటి సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి శేషాద్రి నటించారు. హీరో రామ్ లఖన్ ఖల్నాయక్ తేరే మెహర్బానియన్ రంగీలా దేవదాస్ బంధన్ త్రిదేవ్ వంటి అద్భుతమైన సినిమాలలో నటించిన జాకీష్రాఫ్ ఈరోజు తన 67వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.తన అభిమానులు ఈయనను ముద్దుగా జగ్గు దాదా అని పిలుచుకుంటారు అయితే ఈరోజు ఆయన ఉన్న స్థానం ఆయనకి అంత సులువుగా వచ్చినది కాదు.

 

నిజానికి హీరో సినిమాకి ముందు జాకీ కి అసలు యాక్టింగ్ ఏ తెలియదు. డైలాగులు కూడా సరిగ్గా చెప్పలేకపోయాడని సుభాష్ గై ఒకసారి స్వయంగా చెప్పారు కానీ జాకీ ఎంతో కాన్ఫిడెన్స్ తో సినిమాకు సైన్ చేశారు.నిజానికి జాకీ యొక్క లుక్స్ తో పాటు మీసాలను చూసి సినిమాను చేసినట్లు చెప్పారు అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ ఒక్క సినిమా జాకీ భవిష్యత్తుని మార్చేసింది. తొలి సినిమాతోనే ఆయన బాలీవుడ్ మొత్తాన్ని ఆయన వైపు చూసేలా చేసుకున్నారు.

ఈ సినిమా తర్వాత 200 పైగా చిత్రాల్లో నటించారు.ఇప్పుడు 212 కోట్ల ఆస్తి సంపాదించిన ఈ నటుడు నిజానికి సినిమాల్లోకి రాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు.నిజానికి ఈయన ముందు జర్నలిస్ట్ కావాలని అనుకున్నారు. యుక్త వయసులో ఉన్నప్పుడు నిరుద్యోగిగా చాలాకాలం గడిపానని సోదరుడి మరణంతో 11వ తరగతి తరువాత చదువు మానేయాల్సి వచ్చింది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డబ్బు సంపాదించేందుకు సినిమా పోస్టర్లు అతికించడంతోపాటు బస్టాండ్లో వేరుశనగలు అమ్ముకునేవారు.

 

తరువాత అతని లైఫ్ ట్రావెల్ ఏజెంట్ గా టర్న్ అయింది.ట్రావెల్ ఏజెంట్గా చేస్తూనే పలు ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు జాకీ అలాంటి సమయంలో ఒకరోజు బస్టాండ్ లో నిల్చని ఉండగా ఒక వ్యక్తి వచ్చి మోడలింగ్ చేస్తావా అని అడిగారు. మోడలింగ్ చేస్తే డబ్బులు వస్తాయా అని అమాయకంగా అడిగారంట జాకి వస్తాయి అని వచ్చిన అతను చెప్పడంతో మోడలింగ్ లోకి ఎంటర్ ఇచ్చి తర్వాత సినీ యాక్టర్ గా సక్సెస్ అయ్యారు జాకీష్రాఫ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -