Moon: చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుందో తెలుసా.. చంద్రుడి రంగు ఏంటో తెలుసా?

Moon: ఇటీవల ఇస్రో చంద్రుడిపై అన్వేషణ కోసం చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక కీలక మైలురాయిని చేరుకుంది. విక్రమ్ ల్యాండర్ అంతరిక్ష నౌక నుంచి విడిపోయి చంద్రుని కక్ష్యలో తిరగడం ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. అలా తిరుగుతూ, క్రమంగా దగ్గరకు వెళ్లి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. కాగా చంద్రుడిని అధ్యయనం చేయడంలో చంద్రయాన్-3 ఒక కీలకమైన ప్రాజెక్ట్.
చెప్పవచ్చు. అయితే, ఇప్పటి చంద్రుడి గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి.
అస్సలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు?

ఈ సందేశం చాలా మందికి కలిగే ఉంటుంది. కానీ దీనికి స్పష్టమైన సమాధానం లేదు. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడన్న అంశంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేకమంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువమంది ఆమోదించిన సిద్ధాంతం ఒకటుంది. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట కుజుడి పరిమాణంలో ఉండే వస్తువు ఒకటి భూమిని బలంగా ఢీకొట్టింది. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘం ఏర్పడి, అందులోని శిలలు, ఆవిరి, ఇతర పదార్ధాలన్నీ ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతారు.

 

అలాగే చంద్రుడు లేకపోతే భూమి ఏమవుతుంది? చంద్రుని ఆకర్షణ శక్తి భూమి దాని అక్షంమీద ఉండేందుకు కారణమవుతోంది. ఒకవేళ చంద్రుడు లేకపోతే, భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదిలికలలో తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో రుతువులలో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రపు ఆటుపోట్లలో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడివి కూడా మారవచ్చు. చంద్రుడు లేకపోతే భూ వాతావరణం, గ్లోబల్ వార్మింగ్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 3,84,400 కి.మీ దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమికి 2,70,000 కి.మీ దూరంలో ఉన్నట్లు ఇటీవలి అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -