Lunar Eclipse 2023: నేడు రాహుగ్రస్త చంద్రగ్రహణం.. ఈరోజు చంద్రుడిని చూస్తే వాళ్లకు ఇంత ప్రమాదమా?

Lunar Eclipse 2023: నేడు పౌర్ణమి కావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఏర్పడే ఈ చంద్రగ్రహణం రాహు గ్రస్త కండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారిపై ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈరోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణ సమయంలో కొందరు చంద్రుడిని చూడకూడదని పండితులు చెబుతున్నారు మరి ఏ ఏ రాశి వారు చంద్రగ్రహణం చూడకూడదు అనే విషయానికి వస్తే…

మేష రాశి కర్కాటక రాశి సింహ రాశి ఈ మూడు రాశుల వారు ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణం చూడకూడదు. అలాగే నేడు కుమారస్వామి పౌర్ణమి కావడంతో ఎవరైతే ఈ వ్రతం ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారు కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలలోపే వ్రతం పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇక నాలుగు గంటల తర్వాత ఎలాంటి భోజనాలను తినకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

ఈ మూడు రాశుల వారు అలాగే అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు గ్రహణ సమయంలో చంద్రుడిని చూడకూడదు ఈ రాశుల వారికి మినహా మిగిలిన వారందరికీ కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని పండితులు తెలియజేస్తున్నారు. ఇక గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో గ్రహణకాలం పూర్తి అయిన తర్వాత స్నానమాచరించడం ఎంతో మంచిది. ఇక గ్రహణ సమయంలో పొరపాటున కూడా ఎవరు ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పదునైన వస్తువులతో కూడా పనులు చేయకూడదు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకపోవడం ఎంతో మంచిది ఇలా గ్రహణ సమయంలో బయటికి రావడం వల్ల ఎంతో ప్రమాదకరమైనటువంటి కిరణాలు గర్భం పై పడటం వల్ల లోపల ఉన్నటువంటి బిడ్డకు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకే గర్భిణీ మహిళలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదు అలాగే ఎలాంటి పూజా కార్యక్రమాలలో కూడా పాల్గొనకూడదు. మనకు ఎంతో ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకొని ఆ భగవంతుడిని స్మరించుకోవడం ముఖ్యం. ఇక ఈ మూడు రాశుల వారు వీలైనంతవరకు చంద్రుడిని చూడకపోవడమే మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -