Dreams: పూర్వీకులు మీకు కలలో కనిపిస్తున్నారా.. దాని అర్థం ఏంటంటే?

Dreams: సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో అది పగలైనా రాత్రి అయినా కలలు రావడం అనేది సర్వసాధారణం.ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మనకు గుర్తుంటాయి కొన్ని మనం మర్చిపోతూ ఉంటాము.అయితే కొన్ని కలలు చాలా భయంకరంగా ఉంటాయి ఇలాంటి కలలు కనక వస్తే మన జీవితంలో ఏదో చెడు జరగబోతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అదేవిధంగా మరికొందరికి చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు కూడా తరచు కలలో కనిపిస్తూ ఉంటారు.

ఇలా చనిపోయిన వారు మన కలలో కనిపించడం వల్ల మనం వారి విషయంలో ఏదైనా లోటు చేసామేమో అనే భావన కలుగుతుంది అదేవిధంగా వారికి ఏదైనా కోరికలు తీరలేదేమో అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇలా చనిపోయిన వారు కలలో కనక కనపడితే చాలామంది ఏవేవో ఆలోచనలు చేస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే చనిపోయిన వారు కలలో కనిపించడం దేనికి సంకేతం? చనిపోయిన వారు కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందనే విషయానికి వస్తే..

 

సాధారణంగా మన కుటుంబ సభ్యులు యాక్సిడెంట్ లోను లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల చనిపోయిన వారు కాకుండా సహజ సిద్ధంగా మరణించి ఉంటారు అలాంటి వారి మరణం తర్వాత కూడా వారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మన కుటుంబం పై ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక సాధారణంగా చాలామందికి పడుకున్న సమయంలో పాములు కలలో కనపడుతూ ఉంటాయి.ఇలా పాములు కనక కనపడితే చనిపోయిన మన పూర్వీకుల ఆశీస్సులు ఎల్లవేళలా మనపై మెండుగా ఉన్నాయని అర్థం. అదేవిధంగా వారు ఏ లోకంలో ఉన్న సంతోషంగా ఉన్నారని అర్థం.

 

ఇక చనిపోయిన వారికి కర్మ చేసే సమయంలో మనకు ఎప్పటినుంచో పెండింగ్ పడినటువంటి పనులు పూర్తి అయిన లేదా అనుకోకుండా ధనం కలిసి వచ్చిన అదంతా కూడా చనిపోయిన మన పూర్వీకుల ఆశీస్సులతోనే మనకు లభించాయని భావించాలి. ఇక చనిపోయిన వారు మన కలలో కనిపించి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నట్లు కనక కనిపిస్తే త్వరలోనే మనకు ఏదో శుభం జరగబోతుందని అర్థం. ఇలా చనిపోయిన వారు కలలో కనపడుతూ ఉంటే భయపడాల్సింది ఏమీ లేదని అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -