Dreams: మరణించిన వారు కలలో కనిపిస్తే మంచిదా.. కీడా.? అసలు నిజం ఇదే!

Dreams: నిద్రపోతున్న సమయంలో చాలా మందికి కలలు రావడం సహజమే. ఆ కలలు ఎలా ఉంటాయంటే నిజంగా ఇప్పుడే మన ముందు ఈ ఘటన జరుగుతుందా అనే రీతిలో ఉంటాయి. కొందరు కలలకు భయపడి లేచి నిద్రలోనే ఆరుస్తుంటారు. మరికొందరికి భయపడే కలలు వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తోంది. మరి కొందరు కలలో జరిగే వాటికి ప్రతిస్పందిస్తూ మాట్లాడటం, అరవడం కొందరైతే ఏకంగా లేచి నిలబడి కలలో జరిగే తీరును వివరిస్తుంటారు. ఇలా చాలా మందికి జరుగుతుండటం సహజమే. మనం రోజువారీ దినచర్య లో జరిగే పరిణమాలు, మనం ఎక్కువగా దేన్ని గుర్తు పెట్టుకోవడం, దాని గురించే ఆలోచించడం చేస్తే అదే రాత్రికి కలలో వస్తుంటాయి. అవి ఒకరకమైన మన మెమరీ అని కొందరు శాస్త్రజ్ఞులు పేర్కొంటుండగా భవిష్యత్తు తెలియజేసేదే కల అని మరి కొందరు పండితులు చెబుతుంటారు.

కలల రకాన్ని బట్టి ఒక్కో అర్ధం ఉంటుందట. అయితే మరణించిన వ్యక్తులు మన కలలోకి వచ్చినట్లయితే, అది మనం వారి గురించి ఎక్కువగా ఆలోచించడం తోనే వస్తారని కొందరి అభిప్రాయం. అలాగే మరి కొన్నిసార్లు వారు కలలోకి రావడం అనేది కొన్ని సూచనలను అందించడానికి కూడా కావొచ్చట. స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన మన కుటుంబ సభ్యులు లేదా పెద్దలు కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే వారు ఏదో బాధ లో ఉన్నారని సూచన. వారి ఆత్మ శాంతి కోసం, వారికి శ్రాద్ధ కర్మలు, లేదా ఏమైనా శాంతి పూజలు చేయాలని సందేశం అని పెద్దలు చెబుతుంటారు.

అంతేకాక ఇలాంటి కలలు రావడం అనేది, ఏదైనా చెడు జరగవచ్చని సూచిస్తుందట. కలలో కనుక వారితో సంభాషిస్తున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో ఆనందం రాబోతుందని సంతోషం పెరగనుంది అని ఒక సూచన అని స్వప్న శాస్త్రం వెల్లడిస్తోంది. చనిపోయిన పూర్వీకులు కలలో సంతోషంగా కనిపిస్తే, దీర్ఘాయువు చేకూరుతుంది ఏదేమైనా కలలో మన పూర్వీకులు కనుక కనిపిస్తే వారిని తలుచుకుంటూ వారి ఆత్మ శాంతి కోసం కొన్ని శాస్త్ర బద్ధమైన పూజలు చేయడం మంచిది అని పెద్దలు చెబుతూ వస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -