Devotional: కలలో తల్లిదండ్రులను చూడడం మంచిదేనా? దేనికి సంకేతం?

Devotional: సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. చాలామంది పీడకలలు వచ్చినప్పుడు ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇక కలలో మనకు పక్షులు జంతువులు మనుషులు, చావులు, పుట్టుకలు ఇలా ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. చాలామంది కలలో పూర్వీకులను చూస్తూ ఉంటారు. కలలో పూర్వీకులు కనిపిస్తే అది భవిష్యత్తులో జరిగే కొన్ని రకాల సూచనలకు అర్థం అని చెప్పవచ్చు. అందుకే కలలో పూర్వీకులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని అంటూ ఉంటారు.

 

మరి పూర్వీకులు కలలో కనిపించడం ఎటువంటి వాటికీ సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలలో పూర్వీకులు లేదంటే తల్లిదండ్రులు మీ తల దగ్గర నిలబడి ఉంటే దానిని శుభ సూచకంగా భావించాలి. అంతేకాకుండా అటువంటి కల వస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొందర్లోనే పరిష్కరించబడతాయి అని అర్థం. మన పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో ఎదురయ్యే పలు రకాల సమస్యల నుంచి బయటపడతామని అర్థం. అదేవిధంగా కలలో పూర్వికులు పాదాల దగ్గర నిలబడి ఉంటే అది మంచిది కాదు. ఆ కల భవిష్యత్తులో మీరు ఎదుర్కొనబోయే సమస్యలను సూచిస్తుంది. కాబట్టి మీరు ఏమి చేయాలన్నా కూడా జాగ్రత్తగా చూసి చేయడం మంచిది.

 

అంతే కాకుండా మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ దాన ధర్మాలు చేయాలి. అలాగే పూర్వీకులు కలలో కనిపించి వెంటనే మాయం అయితే మంచిది కాదు. అలాంటి కల వస్తే మీ జీవితంలో ఆకస్మిక ఇబ్బందులు ఎదురవుతాయి అనీ అర్థం. అటువంటప్పుడు మీకు ఇష్టమైన దేవుళ్లను పూజించడం మంచిది. అలాగే మీరు మీ పూర్వీకులకు కలలో భోజనం పెడుతున్నట్టుగా కల వస్తే అది శుభ సూచకంగా భావించాలి. అలాంటి కల వస్తే జీవితంలో గొప్ప ఆనందం డబ్బు వస్తుందని అర్థం. అంతేకాకుండా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయనడానికి శుభసూచకంగా చెప్పవచ్చు. అలాగే కలలో మిమ్మల్ని పూర్వీకులు ఏదైనా అడగడం లేదంటే కలలో ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది శుభసంకేతంగా భావించవచ్చు. అటువంటి కల వస్తే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవని అర్థం. మీకు ఈ రకమైన కల వస్తే, దాని దుష్ప్రభావాలను తొలగించడానికి పేదవారికి ఆహారాన్ని దానం చేయండి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -