Mobile Phones: ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా.. ఆ వ్యాధి వస్తుందట!

Mobile Phones: ఈ రోజుల్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు సెల్ ఫోన్ లేకుండా ఎవరికీ రోజు గడవడం లేదు. ప్రజల మీద సెల్ఫోన్ ప్రభావం ఎంతగా పడింది అంటే చేతిలో ఫోన్ లేకపోతే చెయ్యి లేనట్లుగా ఫీల్ అవుతున్నారు. పరిధి దాటకుండా వాడుకుంటే పర్వాలేదు కానీ పరిధి దాటితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని చైనా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. చైనాలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్జ్ యాన్ వూ క్విన్ ఈ అంశంపై రిపోర్టుని తయారు చేయడం జరిగింది. వారానికి 30 నిమిషాలు అంతకంటే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడితే అధిక రక్తపోటు ముప్పు సుమారు 12 శాతం పెరుగుతుందని ఇందుకు సంబంధించిన వివరాలు డిజిటల్ హెల్త్ అనే యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.

 

వారంలో ఐదు నిమిషాల కంటే తక్కువ మొబైల్ లో మాట్లాడే వారితో పోలిస్తే 30 నుంచి 59 నిమిషాలు మాట్లాడే వారిలో 8 శాతం, ఒకటి నుంచి మూడు గంటలు మాట్లాడే వారిలో 13 శాతం. నాలుగు నుంచి ఆరు గంటలు మాట్లాడే వారిలో 25% బిపి పెరిగే ముప్పు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు తక్కువ వస్తాయి రేడియో ఫ్రీక్వెన్సీ సెక్షన్ విడుదల చేస్తాయని దీనివల్ల రక్తపోటు పెరుగుతుందని చైనా శాస్త్రజ్ఞుల విశ్లేషణ.

 

మొబైల్ ఫోన్ ఎంతసేపు మాట్లాడారు అన్న అంశంపై గుండె ఆరోగ్య స్థితి ఆధారపడి ఉంటుందని.. ఎక్కువసేపు మొబైల్లో మాట్లాడే వారికి డిస్క్ ఎక్కువగా ఉంటుందని క్విన్ తెలిపారు. యూకే బయోబ్యాంక్ ఈ డేటాను సేకరించింది 37 ఏళ్ల నుంచి 73 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 2,12,046 మంది పై స్టడీ చేయగా భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -