POCO: రూ.7000 లోపే పోకో సీ50 మొబైల్.. సేల్స్ ఎప్పటినుంచో తెలుసా?

POCO: ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు వరుసగా మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఆయా కంపెనీలు వినియోగదారుల కోసం తక్కువ ధరకే న్యూ ఇయర్ సందర్భంగా మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే బేసిక్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకున్న వారికి పోకో కంపెనీ బడ్జెట్ ధరలోని ఒక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఆ వివరాల విషయానికొస్తే.. తాజాగా పోకో సీ50 మోడల్‌ను పరిచయం చేసింది. ఇది పోకో సీ సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్. కాగా ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఇకపోతే ఈ పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది.

 

అందులో ఒకటి 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499 కాగా రెండవది 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299 గా ఉంది. నేడు అనగా జనవరి 10న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. రాయల్ బ్లూ, కంట్రీ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద బేస్ వేరియంట్‌ను రూ.6,249 ధరకే సొంతం చేసుకోవచ్చు. కాగా పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ విషయానీకి వస్తే.. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉంది. లెదర్ లాంటి టెక్స్‌చర్‌తో బ్యాక్ ప్యానెల్ ఉంటుంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

 

ఇక పోకో సీ50 స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 8 మెగా పిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 5 ఎంపీ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. పోకో సీ సిరీస్‌లో ఇప్పటికే పోకో సీ31 మోడల్ ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. పోకో సీ31 ప్రారంభ ధర రూ.8,499 గా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -